- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
viral : కింద పడుకొని ఆ యువతి చేసిన పనికి తట్టుకోలేకపోతున్నాం.. నెటిజన్ల రియాక్షన్ ఇదే.. (వీడియో)
దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలనే ఆలోచనతో కొందరు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఫాలోవర్సును పెంచుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. లైకులు, షేరింగ్‌లు, వ్యూస్ కోసం వెరైటీ స్టంట్లతో రీల్స్ చేస్తున్నారు.ఎంత రిస్కైనా రీల్స్ చేసి తామేంటో నిరూపించుకోవాలనే ధోరణి ఇటీవల యువతలో పెరుగుతోంది. పలువురు చేస్తున్న వెరైటీ స్టంట్లు కొందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుండగా, మరి కొందరికి ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఇంకొందరు ఈ వెరైటీలు తట్టుకోలేకపోతున్నామంటూ రియాక్ట్ అవుతున్నారు.
ఆ మధ్య ఓ యువతి నడిరోడ్డులో డ్యాన్స్ చేయడం, మరో యువతి మెట్రోలో స్టెప్పులు వేయడం, ఇంకో చోట ఇద్దరు యువతులు బైకుపై ముద్దులు పెట్టుకుంటూ రొమాన్స్ చేయడం వంటి రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఇటువంటి వెరైటీ స్టంట్లు రోడ్డులు, బస్టాండులు, మెంట్రో స్టేషన్లు దాటి కాస్త ఎయిర్ పోర్టు దాకా పాకాయి. తాజాగా ఒక యువతి ఎయిర్ పోర్టులో చేసిన వెరైటీ స్టండ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వచ్చి రాగానే ఓ యువతి ఎయిర్ పోర్టులోని బ్యాగేజ్ కన్వేయర్ బెల్టుపై వెల్లకిల పడుకొని రీల్ చేసింది. ఈ వీడియోకు బ్యాగ్రౌండ్‌లో ఓ హిందీ సాంగ్ కూడా ప్లే అవుతోంది. ఇక యువతి చేసిన ఈ స్టంట్ వీడియోను దేసి మోజిటో అనే యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. సదరు యువతి చేసిన పనికి కొందరు ఇదేం వెరైటీ రా బాబు తట్టుకోలేకపోతున్నాం అంటూ కామెంట్ చేయగా, మరి కొందరు వెరైటీగా ట్రై చేశావ్ అని పొగుడుతున్నారు. ఇంకొందరు ఇలాంటివి అవసరమా? వెరైటీ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటారెందుకు? అని రియాక్ట్ అయ్యారు. మరో నెటిజన్ బ్యాగేజ్ బెల్ట్ అంత చెత్తగా ఉంటే నీకు దానిపడి ఎలా దొర్లబుద్ధి అయింది.. తట్టుకోలేకపోతున్నానంటూ స్పందించాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.