20ఏళ్లు వచ్చిన అమ్మాయిలు.. ఈ అలవాట్లతో తిరుగులేకుండా ఎదుగుతారు

by Sujitha Rachapalli |
20ఏళ్లు వచ్చిన అమ్మాయిలు.. ఈ అలవాట్లతో తిరుగులేకుండా ఎదుగుతారు
X

దిశ, ఫీచర్స్ : అమ్మాయిలు 20వ పుట్టినరోజు జరుపుకున్నారా? మొత్తానికి ట్వంటీస్‌లోకి అడుగుపెట్టేశారన్న మాటే. ఇది లైఫ్‌లో గోల్డెన్ ఫేజ్. ఇప్పుడు మీరు మంచి జీవనశైలిని అలవరుచుకుంటే.. ఈ ఇంపాక్ట్ జీవితాంతం ఉంటుంది. మెంటల్, ఫిజికల్ హెల్త్‌పై సానుకూల ప్రభావం చూపుతుంది. చిన్న చిన్న అలవాట్లే కావచ్చు కానీ వాటి ఫలితం అద్భుతంగా ఉంటుంది. మీలో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. అవేంటో చూద్దాం.

ఎక్సర్‌సైజ్

20లలో ఏర్పరుచుకునే బెస్ట్ హ్యాబిట్ యాక్టివ్‌గా ఉండటమే. అంటే కేవలం జిమ్, ఎక్సర్‌సైజ్, వాకింగ్, సైక్లింగ్, రన్నింగ్, యోగా అని మాత్రమే కాదు. ప్రతి మూమెంట్‌లోనూ యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయడం. ఈ డెయిలీ యాక్టివిటీస్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. శక్తిని పెంచుతాయి. మూడ్‌ బెటర్ చేస్తాయి. స్ట్రెచింగ్, మెట్లు ఎక్కడం లాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా బెటర్ చేంజ్ చూపిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడుతాయి.

భోజనం స్కిప్ చేయొద్దు

20లలో పనిలో, చదువులో బిజీగా ఉండటం.. సోషల్‌గా మూవ్ కావడం చాలా కామన్. కానీ ఈ ధ్యాసలో పడిపోయి భోజనం చేయకుండా ఉండకూడదు. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ టైమ్‌కు చేసేయాలి. ఇందుకోసం కచ్చితంగా సమయం కేటాయించాలి. ఈ అలవాటు ఎనర్జీ లెవల్స్‌ స్టేబుల్‌‌గా ఉండేందుకు, మెటబాలిజమ్ రేటు పెంచేందుకు హెల్ప్ అవుతుంది. ఆరోగ్యానికి హానికరమైన స్నాక్స్ స్కిప్ చేయడం మంచిది. జీర్ణక్రియపై ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంటుంది.

మెడిటేషన్

20లలో ఎదురయ్యే చాలెంజ్‌లు స్ట్రెస్‌కు గురిచేస్తాయి. ఇలాంటి ఒత్తిడి తగ్గించుకునేందుకు మెడిటేషన్ డెయిలీ చేయడం మంచిది. ఐదు నుంచి పది నిమిషాల మెడిటేషన్ ఆందోళనను తగ్గిస్తుంది. ఫోకస్ పెంచుతుంది. ప్రశాంతమైన మైండ్‌సెట్ ప్రమోట్ చేస్తుంది. లైఫ్ ఎలాంటి సవాళ్లను విసిరినా వాటిని తట్టుకోవాలంటే మీ మైండ్‌ను మెడిటేషన్‌తో హ్యాండిల్ చేసేలా ట్రెయిన్ చేయండి.

డిజిటల్ డిటాక్స్

ఫోన్‌కు అడిక్ట్ అయిపోవడం చాలా సులభం. సోషల్ మీడియా, నోటిఫికేషన్స్‌తో ఎప్పుడూ ఫోన్‌లోనే ఉండటం కూడా ఈజీ. కానీ గంటలు గంటలు స్క్రీన్‌ను చూడటం స్లీప్ క్వాలిటీ తగ్గిస్తుంది. కంటి అనారోగ్యానికి కారణమవుతుంది. స్ట్రెస్ లెవల్స్ కూడా పెరుగుతాయి. అందుకే డిజిటల్ డిస్ట్రాక్షన్స్ అవసరం. భోజనం చేసేటప్పుడు, పడుకునే ముందు, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో స్పెండ్ చేసేటప్పుడు మొబైల్‌కు దూరంగా ఉండండి. దీనివల్ల స్లీప్ క్వాలిటీ పెరుగుతుంది. ఫోకస్ పెరగడంతోపాటు మానసిక ఆరోగ్యం కలుగుతుంది.

Next Story