రోజూ ఒక్క వ్యాయామం చేస్తే చాలు.. క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చు!

by samatah |   ( Updated:2022-12-21 10:00:51.0  )
రోజూ ఒక్క వ్యాయామం చేస్తే చాలు.. క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చు!
X

దిశ, ఫీచర్స్ : వ్యాయామం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది వాస్తవం. కానీ క్యాన్సర్‌ను కూడా ఆరికడుతుందని తాజా అధ్యయనం నిరూపించింది. కేవలం ఒక్క వ్యాయామం.. ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్న రోగులలో కణితి పెరుగుదలను గణనీయంగా తగ్గించగల క్యాన్సర్ నిరోధక ప్రోటీన్‌లను ఉత్పత్తి చేసిందని రుజువు చేసింది.

అధిక స్థాయి శారీరక శ్రమ, తక్కువ క్యాన్సర్ ప్రమాదాల మధ్య సంబంధం గుర్తించిన అధ్యయనం.. తరచుగా ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల వివిధ రకాల క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడం మాత్రమే కాకుండా, ట్రీట్మెంట్ ఫలితాలను మెరుగుపరుస్తుందని స్పష్టం చేసింది.

గత సంవత్సరం ఆస్ట్రేలియాలోని ఎడిత్ కోవాన్ విశ్వవిద్యాలయం (ECU) శాస్త్రవేత్తలు ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 10 మంది పురుషులపై 12 వారాల వ్యాయామ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్ ముగిసే సమయానికి.. వారిలో రక్తంలో మయోకిన్‌ల స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని కనుగొన్నారు. అస్థిపంజర కండరాల ద్వారా ఉత్పత్తి చేయబడిన ఈ ప్రోటీన్లు కణితి పెరుగుదలను నేరుగా అణిచివేయడమే కాకుండా.. శరీరంలోని ఇతర క్యాన్సర్ వ్యతిరేక ప్రక్రియల శ్రేణిని ఏర్పాటు చేశాయి.

కొత్త అధ్యయనం కోసం, ECU బృందం మయోకిన్‌లను మరింత అన్వేషించింది. చివరి దశ ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న తొమ్మిది మంది రోగులు స్టేషనరీ బైక్‌పై 34 నిమిషాల పాటు ఒకే వ్యాయామం చేశారు. ఈ సమయంలో సెషన్‌కు ముందు, తర్వాత వారిలో రక్త సీరం యొక్క నమూనాలను సేకరించారు. ఊహించినట్లుగానే, వర్కవుట్ తర్వాత తీసుకున్న సీరమ్‌లో ఇంతకు ముందు తీసుకున్న బేస్‌లైన్‌తో పోలిస్తే మయోకిన్‌ల స్థాయి పెరిగింది.


ఈ ప్రోటీన్ల యొక్క క్యాన్సర్ నిరోధక లక్షణాలను ప్రదర్శించడానికి, బృందం ల్యాబ్ డిష్‌లోని ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలకు సీరం నమూనాలను వర్తింపజేసింది. వ్యాయామం చేసిన వెంటనే నమూనాలలో మయోకిన్‌ల అధిక స్థాయిలు కణితి పెరుగుదలను 17% వరకు అణిచివేసినట్లు కనుగొనబడ్డాయి.

Read More: రాత్రి సేకరించిన తల్లి పాలు పగలు తాగిస్తే.. శిశువు నిద్రకు అంతరాయం.. ఎందుకు?

Advertisement

Next Story

Most Viewed