- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రెస్టారెంట్‌గా మారిన ట్రామ్‌కార్.. ఓల్డ్ కోల్‌కతాను ప్రదర్శించాలనే ప్రయోగం..
దిశ, ఫీచర్స్ : కోల్‌కతా కల్చర్‌లో ట్రామ్ కార్స్ ఓ అంతర్భాగం. ఒకప్పుడు 'కోల్‌కతా సిటీ లైఫ్‌లైన్'గా పరిగణించిన ఈ ట్రామ్స్.. మెట్రో, ఇతర రవాణా మార్గాలతో పోటీపడలేక నెమ్మదిగా తమ ఔచిత్యాన్ని కోల్పోతున్నాయి. అయితే ఆ ప్రాభవాన్ని పునరుజ్జీవింపజేసేందుకు ప్రయత్నిస్తున్న కొందరు.. 'ఫుడ్ ఆన్ వీల్స్' కాన్సెప్ట్‌తో ట్రామ్‌కార్స్‌ను అందమైన రెస్టారెంట్స్‌గా మలుస్తున్నారు.
కోల్‌కతాలోని మదర్ వాక్స్ మ్యూజియం సమీపాన గల 'ఎకో పార్క్'లో కొత్తగా ట్రామ్ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. న్యూటౌన్ కోల్‌కతా డెవలప్‌మెంట్ అథారిటీ(NKDA) ద్వారా అభివృద్ధి చేసిన ఈ రెస్టారెంట్‌కు 'ట్రామ్ - బగ్గీ నంబర్ 261'గా నామకరణం చేశారు. 20 సీట్ల సామర్థ్యం గల ఈ సెంటర్.. పావ్ భాజీ, చోలే భటుర్, చాట్, రోల్స్ సహా కోల్‌కతాకు చెందిన విభిన్న స్ట్రీట్ ఫుడ్స్‌ను కస్టమర్లకు అందిస్తోంది.
'మేము ఈ రెస్టారెంట్ ద్వారా ఓల్డ్ కోల్‌కతాను ప్రదర్శించాలని అనుకుంటున్నాం. ఇంటీరియర్స్ కూడా అందుకు అనుగుణంగానే రూపొందించాం. ఇక్కడి స్తంభంపై చిత్రీకరించిన అనేక కార్టూన్స్‌తో పాటు రెస్టారెంట్ సమీపంలోని ల్యాంప్ పోస్ట్‌లపై అతకించిన పాత సినిమాల పోస్టర్స్ తప్పకుండా ఆనాటి రోజులను గుర్తుచేస్తాయి. ఇక ఈ రెస్టారెంట్ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంద'ని కోల్‌కతా స్ట్రీట్ ఫుడ్ మేనేజర్ తారాశంకర్ ఛటర్జీ పేర్కొన్నారు.