- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఈ స్క్రబ్‌తో ముఖ సౌందర్యాన్ని పెంచుకోండి..!
దిశ, ఫీచర్స్: ఆడవారికి వారి అందమే అలంకారం.ఆడవారికి వారి అందమే అలంకారం. ఆ అందాన్ని కాపాడుకునేందుకు మార్కెట్‌లో దొరికే రకరకాల క్రీమ్స్ వాడి ఉన్న అందాన్ని పొగొట్టుకుంటున్నారు. ట్యాన్ కారణంగా చర్మం నిర్జీవంగా, గరుకుగా అనిపిస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి చాలా మంది పార్లర్ల చుట్టూ తిరుగుంటారు. కానీ, కొన్ని రోజుల తరువాత మళ్లీ స్కిన్ నిర్జీవంగానే కనిపిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే కెమికల్స్ వల్ల చర్మం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే ఆరోగ్య సంరక్షణకు సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించాలని చెబుతుంటారు.
ఇంట్లో తయారు చేసుకునే బాడీ స్క్రబ్‌లు మీ చర్మాన్ని లోతుగా శుభ్రం చేసి, మృదువుగా మార్చుతాయి. ముఖ్యంగా సున్నితమైన స్క్రబ్‌లు ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. అటువంటి వాటిలో కాఫీ స్క్రబ్ ఎంతో మేలు చేస్తుంది. కాఫీలో ఉండే కెఫిన్, యాంటీ ఆక్సిడెంట్లు స్కిన్ మెరవడానికి ఉపయోగపడతాయి. ఈ అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న కాఫీ స్క్రబ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.
ఇలా చేయండి:
కాఫీ పొడి - 2 టీస్పూన్లు
బ్రౌన్ షుగర్ - ఒకటిన్నర స్పూన్
ఆలివ్ నూనె- టీ స్పూన్
తేనె - టీస్పూన్
పాలు - టీస్పూన్
వీటన్నింటిని ఒక బౌల్‌లో కలుపుకుని, ముఖానికి గుండ్రంగా రుద్దుకోవాలి. ఆ తర్వాత 20 నిమిషాలు ఆరనిచ్చి చల్లటి నీటితో కడగాలి.
ఇలా కాఫీ స్క్రబ్‌ను వారంలో రెండు రోజుల పాటు చేస్తుంటే.. మీ ముఖంపై ఉన్న మృతకణాలు తొలగిపోయి ముఖం మెరవడంతోపాటుగా మొటిమలు, కళ్లకింద మచ్చలు కూడా మాయమౌతాయి.