- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జంతువుల్లోనూ భావోద్వేగాలు.. ఆయా సందర్భాల్లో ఎలా ప్రదర్శిస్తాయంటే..
దిశ, ఫీచర్స్ : బాధలు, భావోద్వేగాలు సాధారణంగా మనుషులకే ఉంటాయని కొందరు అనుకుంటారు. ఎవరైనా కఠినంగా ప్రవర్తిస్తుంటే మనిషివా?, జంతువా? అని పోల్చుతూ తిట్టడం కూడా మనం గమనిస్తుంటాం. కానీ ఇలా తిట్టడం కరెక్టు కాదంటున్నారు జంతు ప్రేమికులు. ఎందుకంటే ఎమోషన్స్ మనుషులకే కాదు, జంతువులకూ ఉంటాయని పరిశోధనల్లో సైతం తేలింది. మరికొందరు పెట్ డాగ్స్ ఎక్కువగా మనుషులతో కలిసి ఉంటాయి కాబట్టి వాటికి మాత్రమే భావోద్వేగాలు ఉంటాయని, మిగతా జంతువులకు ఉండవని అనుకుంటారు. ఇది కూడా వాస్తవం కాదు. అన్ని జంతువులకూ బాధలు, భావోద్వేగాలు ఉంటాయి. అయితే కొన్ని జంతువులు వాటిని ఎలా వ్యక్తం చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చింపాంజీలు
సహచరులు లేదా భాగస్వాములు మరణించినప్పుడు ఉండే బాధ మనుషులకే చింపాజీలకూ ఎక్కువే. తమతో పాటు కలిసి ఉండే మరో చింపాంజీ చనిపోతే మిగతా చింపాంజీలు కొన్ని వారాలు లేదా నెలలపాటు బాధపడతాయి. ఒక దగ్గర గుమిగూడి భావోద్వేగానికి లోనవుతాయి. చనిపోయిన చింపాంజీ డెడ్ బాడీ చుట్టూ తిరుగుతూ, తాకుతూ బాధను వ్యక్తం చేస్తాయి. కొన్ని సందర్భాల్లో చింపాంజీ పిల్లలు చనిపోతే, తల్లి చింపాంజీ వాటిని అంటి పెట్టుకొని ఉంటూ బాధపడటం, బాధను తట్టుకోలేక కళేబరాలను మోసుకుంటూ వారాలు, నెలల తరబడి తిరగడం చేస్తూ భావోద్వేగాలను వ్యక్త పరుస్తాయి.
కుక్కలు
భావోద్వేగాలకు లోనయ్యే వాటిలో చింపాంజీల తర్వాత కుక్కలు ముందు వరుసలో ఉన్నాయి. ముఖ్యంగా పెంపుడు కుక్కలు తమ యజమాని చనిపోతే చాలా బాధ పడతాయి. ఎమోషనల్‌గా ఫీలవుతాయి. కొన్ని రోజుల తరబడి తిండి సరిగ్గా తినవు. అలాగే తరచుగా కలిసి ఉండే కుక్కలు తమ సహచరుల్లో ఏదైనా మరణించినప్పుడు కూడా దాని శరీరాన్ని తాకుతూ, వాసన చూస్తూ ఏడుస్తాయి. భావోద్వేగానికి లోనవుతాయి. సంతాప సూచకంగా కుక్కలన్నీ గుమిగూడి ఏడవడం చేస్తాయట.
గుర్రాలు
గుర్రాలు కూడా భావోద్వేగాలు ప్రదర్శిస్తాయి. గుంపుగా ఉండే గుర్రాల్లో ఏదైనా మరణించిన్నప్పుడు, మిగతా గుర్రాలు దాని శరీరం చుట్టూ నిలబడి నిశ్శబ్దంగా రోదించడం, కంటనీరు కార్చడం ద్వారా తీవ్ర భావోద్వేగానికి లోనవుతాయని నిపుణులు చెప్తున్నారు.
డాల్ఫిన్లు
సముద్రాలు, నదుల్లో ఉండే డాల్ఫిన్లు కూడా భావోద్వేగాలను ప్రదర్శిస్తుంటాయి. తరచుగా కలిసి తిరుగాడే పార్ట్‌నర్‌ను కోల్పోయినప్పుడు డాల్ఫిన్, తన భాగస్వామి శరీరాన్ని టచ్ చేస్తూ లేపే ప్రయత్నం చేస్తూ రోధిస్తుందట. అట్లనే ఒక డాల్ఫిన్ మరణించినప్పుడు దాని భాగస్వామి బాధపడుతుంటే.. అది గమనించిన మిగతా డాల్ఫిన్లు కూడా చుట్టూ చేరి బాధపడతాయట. బాధలో ఉన్న డాల్ఫిన్ శరీరాన్ని తాకుతూ ఓదారుస్తాయి.