- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Eye health: స్మార్ట్‌ఫోన్లు, స్క్రీన్లతో కళ్లపై ఎఫెక్ట్.. ఈ ఫార్ములా పాటిస్తే నో ప్రాబ్లం!
దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు, స్క్రీన్లు చూడకుండా ఉండలేని పరిస్థితి అనివార్యం అవుతోంది. ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ వేదికలుగా ఉండటమే ఇందుకు కారణం. ఒక విధంగా చెప్పాలంటే అవి జీవితంలో భాగం అవుతున్నాయి. అదే సందర్భంలో ప్రతికూల ప్రభావాలు కూడా ఉంటున్నాయి. తరచుగా చూసేవారిలో కంటి చూపు మందగించే అవకాశం ఉందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సమస్య రాకుండా చూసుకోవచ్చని పేర్కొంటున్నారు. అవేంటో చూద్దాం.
* స్మార్ట్‌ఫోన్, ట్యాబ్, డెస్క్‌టాప్ మీరు యూజ్ చేస్తున్న పరికరం ఏదైనా కళ్లకు, వాటికి మధ్య సరైన దూరాన్ని పాటించాలి. కంటిచూపుపై ఎఫెక్ట్ పడకుండా ఉండాలంటే.. సాధారణంగా 16 నుంచి 24 అంగుళాలు లేదా 40 నుంచి 60 సెంటీమీటర్ల దూరం పాటించాలి. దీనివల్ల కంటిపై ఒత్తిడి, లైటింగ్ ఫోకస్ తగ్గుతాయి. దీంతోపాటు కాంట్రాస్ట్ అండ్ స్క్రీన్ బ్రైట్‌నెస్ కూడా మీ కళ్లకు ఇబ్బంది కలిగించని విధంగా ఉండాలి.
* కళ్లపై ఎఫెక్ట్ పడకుండా ఉండాలంటే మీరు స్క్రీన్ చూస్తున్నప్పుడు ‘‘20-20-20’’ ఫార్ములాను ట్రైచేస్తే మంచి ఉపయోగం ఉంటుంది. నిపుణుల ప్రకారం.. దీని సారాంశం ఏంటంటే.. మీరు ఫోన్ చూస్తున్నప్పుడు ప్రతీ 20 నిమిషాలకు ఒకసారి గ్యాప్ ఇచ్చి.. మీకు 20 అడుగుల దూరంలో ఉన్న పరిసరాలను 20 సెకన్లపాటు తదేకంగా చూస్తూ ఉండాలి. దీనివల్ల మీ కళ్లపై ఒత్తిడి, అసౌకర్యం, కంటి చూపు మందగించే అవకాశాలు తొలగిపోతాయి.
* వాస్తవానికి నిరంతరం స్క్రీన్ చూడటం కారణంగా కళ్లల్లో అసౌకర్యం, ఒత్తిడి పెరుగుతుంది. కంటి నరాలు, కండరాలు ఉద్రిక్తంగా మారుతాయి. అదే కంటిన్యూ అవుతుంటే కళ్లల్లో చికాకు, పొడిబారడం, బయటి పరిసరాలను చూస్తున్నప్పుడు అకస్మాత్తుగా నీరు కారడం, కళ్లు లాగడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఇలాంటి సమస్యను నివారించడంలో 20-20-20 ఫార్ములా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని కంటి ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
Read More..
Malta fever : మాల్టా జ్వరం అంటే ఏమిటి.. ఎలా వ్యాప్తి చెందుతుందో చూద్దామా..