- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లాంగ్ హెయిర్ కోసం ఆరాటపడే ఆడవాళ్లు ఈ ఆహారాలు తింటే తిరుగుండదు!
దిశ, వెబ్‌డెస్క్: అమ్మాయిలకు హెయిర్ పొడవుగా ఉంటేనే అందం. అందుకోసం పొడవాటి కురుల కోసం ఆరాటపడే మగువలు ఎందరో ఉంటారు. ఈ క్రమంలో హెయిర్ పొడుగ్గా పెంచుకునేందుకు పలు చిట్కాలను పాటిస్తుంటారు. ఆన్‌లైన్‌లో చూపించే ఆయిల్‌లను ఆర్డర్ చేస్తుంటారు. అయితే సరైన ఆహారం తీసుకున్నట్లైతే ఎలాంటి చిట్కాలు లేకుండానే లాంగ్ హెయిర్ మీ సొంతమవుతుందని తాజాగా నిపుణులు చెబుతున్నారు.
మనం తీసుకునే ఫుడ్‌లో చిన్న చిన్న లోపాలుంటేనే నీరసం, పలు రకాల వ్యాధులు వస్తాయి. దీని ప్రభావం కాస్త హెయిర్‌పై పడుతుంది. దీంతో బలహీనంగా మారి వెంట్రుకలు రాలిపోతాయి. కాబట్టి నిపుణులు సూచించిన ఈ ఆహారాలను తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
వాల్ నట్స్..
పోషకాలు అధికంగా ఉండే వాల్ నట్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే హెయిర్ గ్రోతింగ్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. బాదం, పిస్తా, వాల్ నట్స్ హెల్త్‌కు కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడం, ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడం వంటి ప్రయోజనాలను అందిస్తాయి.
డార్క్ చాక్లెట్..
పుష్కలంగా కోకో కంటెంట్ ఉండే డార్క్ చాక్లెట్ తింటే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ అందుతాయి. హెయిర్ పెరుగుదలకు ఎంతో సహాయపడుతాయి. డార్క్ చాక్లెట్ హార్ట్ ఎటాక్ ప్రమాదం నుంచి రక్షిస్తుంది కూడా.
పుట్ట గొడుగులు..
అనేక రకాల పుట్టగొడుగులు ఉన్నప్పటికీ వీటిలో అన్ని తినదగినవి కావు. వీటిలో కొన్ని బటన్, ఓస్టెర్, పోర్సిని, చాంటెరెల్ వంటివి మాత్రమే తినదగినవి. అధికంగా పోషకాలున్న ఈ రకమైన మష్రూమ్స్ తీసుకోవడం వల్ల హెయిర్ గ్రోతింగ్ బాగుంటుంది.
బచ్చలికూర..
ఎముకల ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడే బచ్చలి కూరలో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. హెయిర్ పెరగడానికి మాత్రమే కాకుండా మధుమేహం ఉన్నవారిలో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి.