ఔషధ గుణాల గని సపోటా..!

by Vinod kumar |   ( Updated:2023-03-12 17:12:48.0  )
ఔషధ గుణాల గని సపోటా..!
X

దిశ, ఫీచర్స్: సపోటా పండును చూడనివారు, ఇష్టపడని వారు దాదాపు ఉండరు. పైగా ఇందులో అనేక ఔషధ గుణాలు దాగున్నాయి. ఆరోగ్యానికి మేలుచేసే ఫ్రక్టోజ్, సుక్రోజ్, షుగర్ కంటెంట్ లెవెల్స్ పుష్కలంగా ఉంటాయి. అసలే ఎండాకాలం ఈ సీజన్లో సపోటా పండ్లు తినడంవల్ల ఆరోగ్యానికి చాలామంచిదట. ఎందుకంటే వీటిలో ఫోలేట్, ఐరన్, పొటాషియం, మినరల్స్, క్యాల్షియం, విటమిన్లు విరివిగా ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్‌ను పెంచే గుణం కలిగి ఉన్నందున వైరస్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది.

సపోటాలోని కాల్షియంవల్ల ఎముకలు, పళ్లు దృఢంగా తయారవుతాయి. విటమిన్ ఏ మూలంగా కంటి సమస్యలు తలెత్తవు. ఫైబర్ ఉండటంవల్ల క్యాన్సర్, జీర్ణాశయ ప్రాబ్లమ్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది.రక్తహీనతతో బాధపడేవారికి సపోటా మేలు చేస్తుంది. మలబద్ధకం సమస్యను వెంటనే తగ్గించే గుణం సపోటా పండుకు ఉంటుంది. గర్భిణులు, వృద్ధులు రోజూ సపోటా తినడంవల్ల శరీరానికి అవసరమైన ఐరన్ కంటెంట్ లభిస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్నాయి కాబట్టి వేసవిలో సపోటాను తప్పక తినాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : ఆ ఊర్లో మహిళలంతా నగ్నంగానే.. 5 రోజులపాటు మగాళ్లంతా అలా చేయాల్సిందే..

Advertisement

Next Story

Most Viewed