రోజుకో ఉల్లిపాయ తింటే చాలు.. నెలసరి సమస్యలు దూరం

by Prasanna |   ( Updated:2023-06-20 08:57:52.0  )
రోజుకో  ఉల్లిపాయ తింటే చాలు..  నెలసరి సమస్యలు దూరం
X

దిశ, వెబ్ డెస్క్ : మహిళలు నెలసరి సమయంలో అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధ పడుతుంటారు. కొందరు నీరసం అవుతారు. మరికొందరికి పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. కడుపులో వికారంగా.. భరించ లేని నొప్పితో బాధ పడుతుంటారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలి అంటే ప్రతిరోజు ఒక పచ్చి ఉల్లిపాయను తింటే చాలు. ఇలా తినడం వలన నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. పచ్చి ఉల్లిపాయలో నెలసరి సమస్యలను తగ్గించే గుణాలు ఉంటాయని నిపుణులు పరిశోధనలు చేసి వెల్లడించారు. నెలసరి రాని వారు ఉల్లిపాయలు తినడం వల్ల ఆ సమస్యలు తగ్గుతాయి.

Advertisement

Next Story