హెల్త్‌కి మంచిదని షుగర్‌కి బదులు బెల్లాన్ని ఎక్కువగా తింటున్నారా?.. అయితే ఈ సమస్యలు ఖాయం

by Kavitha |
హెల్త్‌కి మంచిదని షుగర్‌కి బదులు బెల్లాన్ని ఎక్కువగా తింటున్నారా?.. అయితే ఈ సమస్యలు ఖాయం
X

దిశ, ఫీచర్స్: ఇటీవల కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధతో చాలా మంది షుగర్ వాడకం చాలా వరకు తగ్గించేశారు. షుగర్‌కి బదులు బెల్లాన్ని వాడుతున్నారు. ఆరోగ్యపరంగా బెల్లం అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో, మెటబాలిజం రేటును పెంచడంలో, జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో, రక్తహీనతను తరిమి కొట్టడంలో, శరీరానికి శక్తిని అందించడంలో, రోగనిరోధక వ్యవస్థను బలపరచడంలో బెల్లం చాలా అద్భుతంగా సహాయపడుతుంది. అయితే ఆరోగ్యానికి మంచిది అన్నారు కదా అని కొందరు బెల్లాన్ని అధికంగా వాడుతుంటారు. ఈ అలవాటు మీకు కూడా ఉంటే వెంటనే వదులుకోండి. ఎందుకంటే అతిగా అమృతం తాగిన విషమే అవుతుంది కాబట్టి.

*అధికంగా బెల్లాన్ని తీసుకోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. శుద్ధి చేసిన తెల్ల చక్కెర కంటే బెల్లం మనకు చాలా మంచిది. కానీ అధికంగా బెల్లం తింటే కేలరీలు పెరుగుదలకు దారితీస్తుంది.ఫలితంగా అధిక బరువు బారిన పడతారు.

*అలాగే బెల్లం వేడిని కలుగజేస్తుంది. అధిక మొత్తంలో బెల్లం తీసుకున్నప్పుడు కొందరికి ముక్కులో మంచి రక్తస్రావం(బ్లీడింగ్ ) అవుతుంటుంది.

*బెల్లంలో అనేక పోషకాలతో పాటు సుక్రోజ్ కూడా ఉంటుంది. కాబట్టి ఎటువంటి లిమిట్ లేకుండా బెల్లం తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పుతాయి. మధుమేహం బాధితులకు ఇది చాలా ప్రమాదకరం.

*వాస్తవానికి బెల్లంలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. జీర్ణక్రియకు ఫైబర్ ఎంతో అవసరం అయితే అదే ఫైబర్ ఎక్కువ మొత్తంలో శరీరంలోకి చేరితే మలబద్ధకం, అతిసారం, కడుపు నొప్పి సమస్యలు కలుగుతాయి. *అంతేకాదు బెల్లాన్ని ఓవర్ గా తీసుకోవడం వల్ల అలసట, తలనొప్పి, వికారం, చర్మంపై దద్దుర్లు వంటి సమస్యలు కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బెల్లాన్ని కూడా మితంగా వాడాలి.

* అదే విధంగా బెల్లాన్ని అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Advertisement

Next Story