కందిపప్పును ఎక్కువగా తింటున్నారా? అయితే .. వీటి గురించి తెలుసుకోవాల్సిందే!

by Prasanna |   ( Updated:2024-03-01 11:52:44.0  )
కందిపప్పును ఎక్కువగా తింటున్నారా? అయితే .. వీటి గురించి తెలుసుకోవాల్సిందే!
X

దిశ, ఫీచర్స్: కందిప్పును, ఎర్ర కంది అని కూడా పిలుస్తారు. మన ఆహారంలో ఇది సాధారణ పప్పుదినుసు. ఇది అధిక పోషక విలువలను కలిగి ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది.

కందిపప్పు వల్ల కలిగే లాభాలు:

ఈ కందిపప్పులో ప్రొటీన్, పీచు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ ఎ, బి, సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అధిక పీచుపదార్థాలు పొట్ట నిండుగా ఉండేలా చేసి అతిగా తినకుండా చేస్తుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.

కందిపప్పు వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్:

సాధారణంగా, కందిపప్పును మితంగా తీసుకుంటే ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. అయితే, ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల సమస్యలు వస్తాయి. కందిపప్పులో వివిధ రకాల చక్కెరలు ఉంటాయి. ఇవి జీర్ణం అయ్యే సమయంలో గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తాయి. కందిపప్పు ను ఎక్కువగా తీసుకోవడం వల్ల కొందరికి కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. దీనిలో ఫైబర్ అధికంగా ఎక్కువగా ఉండటం వల్ల కొంతమందికి గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఎదురవుతాయి.

Read More..

గర్భంలో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలా.. గర్భిణీలు ఈ పప్పులను తప్పకుండా తినాలట..

Advertisement

Next Story

Most Viewed