బనానా టీని తాగడం వల్ల ఈ సమస్యలు దూరమవుతాయి!

by Prasanna |
బనానా టీని తాగడం వల్ల ఈ సమస్యలు దూరమవుతాయి!
X

దిశ,ఫీచర్స్: రోజూ టీ, కాఫీ తాగడం వల్ల కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనికి బదులు అరటిపండు టీ తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ టీ చాలా రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి బాగా మరిగించాలి. ఒక అరటిపండు తీసుకొని దానిని కత్తిరించి.. వేడినీటిలో వేసుకోండి. స్టవ్‌ ను సిమ్‌లో పెట్టి పదిహేను నిమిషాలు బాగా ఉడికించాలి. ఆ తర్వాత వడకట్టి దానిలో దాల్చిన చెక్క పొడి, తేనెను కూడా బాగా కలపాలి. అంతే అరటి పండు టీ రెడీ.

దీని టీ తాగడం వలన మనకి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అరటి పండు టీ తాగడం వల్ల షుగర్ సమస్యలు తగ్గుతాయి. ఎందుకంటే, అరటి పండు టీలో ట్రిప్టోఫాన్, సెరోటోనిన్, డోపమైన్ ఉన్నాయి, ఇవి కండరాలకు ఉపశమనాన్ని కలిగిస్తాయి. అలాగే ఆందోళన, ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఈ టీ తాగడం వలన నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు. అంతే కాకుండా, మీ శరీరంలోని కొవ్వు కరుగుతుంది. మీ భద్రత కూడా పెరుగుతుంది. ఈ టీ తాగడం వల్ల మీ గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ టీని ప్రతిరోజూ తాగాలి. దీని వల్ల అనారోగ్య సమస్యల రాకుండా ఉంటాయని చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed