రోజూ మందు కొట్టే అలవాటుందా? అయితే ఈ సమస్యలు తప్పవు

by Hamsa |   ( Updated:2023-02-21 07:23:43.0  )
రోజూ మందు కొట్టే అలవాటుందా? అయితే ఈ సమస్యలు తప్పవు
X

దిశ, ఫీచర్స్: ఈరోజుల్లో అనేక అనారోగ్యాలకు ఆల్కహాల్ సేవించే అలవాటు ప్రధాన కారణం అవుతోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయినా చాలామంది డ్రింక్ చేయడాన్ని వదులుకోవడం లేదు. ఒకప్పుడు కేవలం మగవాళ్లే అధికంగా డ్రింక్ చేసేవారు. కానీ ఇప్పుడు మహిళలు, పురుషులు, యువత అందరిలోనూ మందుకొట్టే అలవాటు కనిపిస్తోందని పరిశీలకులు చెప్తున్నారు. ఆల్కహాల్ తీసుకోవడంలోని మజా, కిక్కు ఎలా ఉన్నా, అది ఆరోగ్యంపై చూపే ప్రభావం మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. వివిధ రోగాల బారిన పడే అవకాశాన్ని పెంచుతుంది.

జీర్ణ సమస్యలు

డ్రింక్ చేసే అలవాటున్న వారిలో జీర్ణ సంబంధిత సమస్యలు త్వరగా తలెత్తుతాయని నిపుణులు చెప్తున్నారు. ఆల్కహాల్ సేవించి ఆహారం తీసుకున్నా దానిని జీర్ణం చేయగలిగే రసాయనాలు విడుదల తగ్గడంవల్ల ఫలితం ఉండదు. అంతేకాకుండా తీసుకున్న ఆహారంలోని పోషకాలు, విటమిన్ల ప్రభావాన్ని ఏ రకం బ్రాండ్ మందు అయినా సరే పీల్చేస్తుంది.దీనివల్ల ఆహారం శరీరానికి మేలును అడ్డుకుంటుంది. రోజూ ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉన్నవారిలో కడుపులో ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు, ఎప్పుడూ కడుపు నిండిన ఫీలింగ్స్ కలుగుతాయి. ఆహారం జీర్ణం చేసేందుకు అవసరమైన హార్మోన్లు రిలీజ్ కాకపోగా, అవసరం లేని ఆమ్లాలు అధికంగా రిలీజ్ అవుతాయి. లివర్ ఫంక్షనింగ్ సక్రమంగా ఉండదు. ఇటువంటి కారణాల రీత్యా లివర్, గుండె సంబంధిత వ్యాధులు, వివిధ దీర్ఘకాలిక అనారోగ్యాలు తలెత్తుతాయి. తరచూ ఆల్కహాల్ తీసుకునే వారిలో ఏజ్‌బార్ అయ్యాక ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గిపోతుంది. చిన్నపాటి అనారోగ్యానికి గురైనా అధిక ప్రభావం పడుతుంది.

బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది

రోజూ మందుకొట్టే అలవాటు కలిగిన వారిలో హైబీపీ సమస్యలు సాధారణంగా వస్తుంటాయి. ఆల్కహాల్ వల్ల రక్తనాళాల్లో ఆటకం కలుగవవచ్చు. అంతేకాదు రక్త నాళాల గోడలపై రక్తం పేరుకుపోయినప్పుడు బ్లడ్ ప్రెషర్ తీవ్రంగా పెరుగుతుంది. కొన్నిసార్లు ఇబ్బందులు ఏర్పడి గుండెపోటుకు దారి తీస్తుంది కూడాను.కాబట్టి డ్రింక్ చేసే అలవాటు మానుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

లివర్ దెబ్బతింటుంది

అధికంగా మద్యం సేవించే వారిలో లివర్ సమస్యలు తలెత్తుతాయి. దాని ఫంక్షనింగ్‌పై సరిగ్గా ఉండదు. జీర్ణ రసాయనాల విడుదలను ఆల్కహాల్ ఆటంక పరుస్తుంది. తర్వాత అది రక్తంలోకి ప్రవేశించి లివర్‌లోకి వెళ్తుంది. అధిక మద్యపానంవల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోయి ఫ్యాటీ లివర్ సమస్యలకు దారి తీస్తాయి.

నాడీ వ్యవస్థపై ప్రభావం

నాడీ వ్యవస్థపై ఆల్కహాల్ లేదా మద్యం సేవించడం తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మెదడులోని ఎంజైముల విడుదల స్లోగా జరుగుతుంది. ఫలితంగా నరాలకు సంబంధించిన సమస్యలు, మానసిక సమస్యలు తలెత్తుతాయి. ఏకాగ్రత లోపించడం, తరచూ టెన్షన్‌కు గురవడం గమనించవచ్చు. బ్రెయిన్ కమ్యూనికేషన్ మార్గాల్లో ఆటంకం ఏర్పడి భిన్నమైన ప్రవర్తనకు దారి తీస్తుంది. మాటల్లో నత్తి దొర్లడం, క్రమంగా పక్షవాతానికి దారి తీయడం జరగవచ్చు. మందు కొట్టినవారు తమపై తాము ధ్యాస లేకుండా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. మత్తెక్కడం దీనికి కారణం అనుకుంటారు. కానీ ఆ మత్తు మెదడు పనితీరును దెబ్బతిస్తుందనేది మాత్రం చాలా మందికి తెలియదు. అందుకే డ్రింగ్ చేసే అలవాటుకు ఎంతదూరం ఉంటే అంతమంచిని వైద్య నిపుణులు చెప్తున్నారు.

ప్యాంక్రియాస్ వ్యాధి

తరచూ మందుకొట్టే వారిలో ప్యాంక్రియాస్ సంబంధిత వ్యాధులు వస్తాయి. ప్యాంక్రియాస్ గ్రంధి వాపునకు గురై ప్యాంక్రియాటైటిస్ అనే వ్యాధి వస్తుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడే ఎంజైములను ఆటంక పరుస్తుంది. బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ను పెంచుతుంది. ప్యాంక్రియాస్‌లో తరచూ మంటగా ఉండవచ్చు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తలెత్తే ప్రమాదాలను పెంచే గుణం ఆల్కహాల్‌కు ఉంటుంది. దీంతోపాటు అనేక అనారోగ్యాలకు కారణం అవుతుంది. వ్యాధులు వచ్చినప్పుడు డాక్టర్లు ఇచ్చే మెడసిన్ వాడినా వాటి ప్రభావాన్ని కూడా ఆల్కహాల్ అడ్డుకోవడంవల్ల ప్రాణహాని సంభవించే అవకాశాలు ఉంటాయి.

Advertisement

Next Story