భయపడకండి.. కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల రక్తం గడ్డకట్టకుండా చేసే ఇంటి చిట్కాలు ఇవే..

by Dishafeatures1 |
భయపడకండి.. కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల రక్తం గడ్డకట్టకుండా చేసే ఇంటి చిట్కాలు ఇవే..
X

దిశ,ఫీచర్స్: ప్రస్తుతం ఈ మండే ఎండల కంటే ఎక్కువ హాట్ హాట్‌గా ఉంటున్న టాపిక్ కోవిషీల్డ్ వాక్సిన్. తన కోవిడ్ వాక్సిన్‌లు రక్తం గడ్డ కట్టడానికి కారణమవుతాయని బ్రిటన్‌కు చెందిన ప్రముఖ డ్రగ్‌మేకర్ కంపెని అస్ట్రాజెనెకా కోర్టులో అంగీకరించినది. కానీ ప్రతి ఒక్కరికి ఈ ప్రమాదం సంభవించదని వెల్లడించింది.

అయితే రక్తం గడ్డకట్టడం అనే ప్రమాదం టీకాలు వేయడం వల్లనే కాకుండా అనేక ఇతర కారణాల వల్ల కూడా వస్తుంది. థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ నివారించడానికి చికిత్స ఉన్నది. అసలు దీని గురించి తెలుసుకోవడానికి, మీరు ప్లేట్‌లెట్ కౌంట్‌ను చెక్ చేస్తూ ఉండాలి. అంతే కాకుండా శరీరంలో రక్తం గడ్డ కట్టినప్పుడు కనిపించే లక్షణాలను గుర్తించి వైద్యులను సంప్రదించితే సమస్య ఉంటే వైద్యులు చికిత్స చేస్తారు. ఇది కాకుండా, మీ ఆహారంలో కొన్ని మార్పులతో కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం.

శరీరంలో రక్తం గడ్డకట్టడం మంచిది కాదు. దీని వల్ల గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ తదితరాలు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల, నివారణ కోసం, మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి, మార్నింగ్ వాక్ చేయడం లేదా సమయం దొరికినప్పుడల్లా నడవాలి. లూస్ బట్టలు వేసుకోండి, ప్రతిరోజూ కనీసం అరగంట పాటు యోగా లేదా వ్యాయామం చేయండి, ఒకే చోట గంటల తరబడి కూర్చోవద్దు లేదా నిలబడకండి. మిమ్మల్ని మీరు చురుకుగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. వీటితో పాటు

*ఔషధ గుణాలతో నిండిన పసుపులో కర్కుమిన్ అనే పదార్థం ఉందని, ఇది రక్తం గడ్డకట్టే అవకాశాలను గణనీయంగా తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది.

*వెల్లుల్లి అనేక ఔషధ గుణాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ని నాశనం చేస్తాయి. అంతేకాదు శరీరంలో రక్తం గడ్డ కట్టకుండా ఉపయోగపడుతుంది.

* నల్ల మిరియాలు శరీరంలోని రక్తాన్ని పలుచగా చేసే సాలిసైలేట్‌లను అధిక మొత్తంలో కలిగి ఉంటుంది. కాబట్టి రక్తం గడ్డకట్టకుండా ఉపయోగపడుతుంది.

* రక్తం పలచబడటానికి మీరు మీ ఆహారంలో చేపలను చేర్చుకోవచ్చు. వీటిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు EPA , DHA ఉంటాయి. కావాలంటే ఫిష్ ఆయిల్ క్యాప్సిల్స్ కూడా తీసుకోవచ్చు.

Next Story

Most Viewed