- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలుగులో మాట్లాడటం పై కాజల్ షాకింగ్ కామెంట్స్..!
దిశ,వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి సుపరిచితమే. సినీ రంగంలో అడుగుపెట్టిన కొంత కాలానికి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోస్ సరసన నటించి అలరించింది. తన అందంతో, నటనతో, అభినయంతో అందరి మనసులు దోచుకుంది. ఈ అమ్మడుకు బాలీవుడ్ , టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఫ్యాన్స్ ఫాలొయింగ్ ఎక్కువే. తన కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే గౌతమ్ కిచ్లును ప్రేమించి పెళ్లి చేసుకుంది. కరోనా సమయంలో కొన్నాళ్లు సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఈ క్రమంలో ఫ్యామిలితో సంతోషంగా కెరీర్ రన్ చేస్తుంది. ప్రజెంట్ మళ్లీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. త్వరలో కాజల్ అగర్వాల్ ఫిమేల్ ఓరియెంటెడ్ చేసిన సత్యభామ మూవీతో రాబోతుంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ సత్యభామ మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. కాజల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు తెలుగు వచ్చని, కానీ మాట్లాడేటప్పుడు కరెక్టా? కాదా? అనే డౌట్ వస్తుండటంతో అందరి ముందు ఎక్కువగా మాట్లాడలేనని హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెప్పారు. సత్యభామ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ట్విటర్లో ఓ విడియోను షేర్ చేశారు. నాకు తెలుగు బాగా తెలుసు. అదంతా నా మనసులో ఉంటుంది. సత్యభామ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడి చూపిస్తా. హ్యాపీ గా ఉంటూ పక్కన వాళ్లందర్నీ హ్యాపీగా ఉండడమే నా బ్యూటీ సీక్రెట్ అని చెప్పారు.