మాఫియా డాన్‌గా సూపర్ స్టార్.. ‘లూసిఫర్-2’ నుంచి పోస్టర్ రిలీజ్

by Hamsa |   ( Updated:2024-05-21 09:24:19.0  )
మాఫియా డాన్‌గా సూపర్ స్టార్.. ‘లూసిఫర్-2’ నుంచి పోస్టర్ రిలీజ్
X

దిశ, సినిమా: మలయాళ హీరో పృథ్వీరాజ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘లూసిఫర్’. ఈ చిత్రం 2019లో థియేటర్స్‌లో విడుదలై మంచి విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా లూసిఫర్-2 రాబోతుంది. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇందులో కీలక పాత్రలో నటించనున్నాడు. నేడు (మే 21) ఆయన పుట్టిన రోజు కావడంతో మేకర్స్ లూసిఫర్-2 నుంచి సూపర్ స్టార్ లుక్ రివీల్ చేసి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు.

ఇందులో మోహన్ లాల్ స్టీఫెన్ గట్టుపల్లి రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నాడు. అయితే ఆయన పొలిటికల్ ఎంట్రీకి ముందు మాఫియా డాన్‌గా ఉన్నాడు. ఇప్పుడు ఆయన పాత్రలో మోహన్ లాల్ నటించనున్నాడు. రాజకీయాల్లోకి రాకముందు ఏం చేశాడు.. ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడు అనేది ఇందులో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా.. మాఫియా డాన్‌గా మోహన్ లాల్ లుక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

Advertisement

Next Story