ఉదయం, సాయంత్రం వేళల్లో సూర్యుడు ఎందుకని ఎర్రగా కనిపిస్తాడు?

by Javid Pasha |
ఉదయం, సాయంత్రం వేళల్లో సూర్యుడు ఎందుకని ఎర్రగా కనిపిస్తాడు?
X

దిశ, ఫీచర్స్ : సూర్యోదయం, సూర్యాస్తమయం వేళలు చూడముచ్చటగా ఉంటాయి. ఎందుకంటే ఆ సమయంలో ఆకాశం ఇంద్రధనస్సును తలపిస్తుంది. సూర్యుడు ఎర్రగా కనిపిస్తుంటాడు. అదే మిగతా సమయాల్లో మాత్రం ఇందుకు భిన్నమై వాతావరణం కనిపిస్తుంది. ఎందుకిలా?.. సూర్యుడు ప్రత్యేక వేళల్లో మాత్రమే ఎందుకని రెడ్ కలర్‌‌లో దర్శనమిస్తాడు? దీని వెనుక గల సైంటిఫిక్ రీజన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

భూమి నిరంతరం తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టు కూడా తిరుగుతూ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ కారణంగా రాత్రి, పగలు, వాతావరణ వైవిధ్యాలు సంభవిస్తుంటాయి. ఇందులో భాగంగా డే టైమ్‌లో సూర్యకాంతి భిన్నంగా, అత్యంత ప్రకాశ వంతంగా ఉంటుంది. సాయంత్రం, ఉదయం వేళ్లల్లో మాత్రం ఎరుపు రంగులోకి మారుతుంది. భూ వాతావరణంలోని అనేక రకాల రాళ్లు, వాయువులు, తరంగ దైర్ఘ్యాలు సూర్యరశ్మిని మార్చడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

నిపుణుల ప్రకారం.. సూర్యాస్తమయం, సూర్యోదయం వేళల్లో సూర్యకాంతి భూమి యొక్క భిన్నమైన వాతావరణ పరిస్థితుల ప్రభావం చెల్లా చెదురుగా మారుతుంది. పైగా ఆ సమయాల్లో నీలం రంగు తక్కువ తరంగ దైర్ఘ్యం, ఎరుపు రంగు ఎక్కువ తరంగ దైర్ఘ్యం కలిగి ఉంటాయి. కాబట్టి వాతావరణంలో కాంతి వికీర్ణం తర్వాత ఎరుపు రంగు మాత్రమే మన కళ్లను చేరుకోగలదు, కాబట్టి సూర్యోదయం, సూర్యస్తమయాల వేళల్లో సూర్యుడు ఎర్రగా కనిపిస్తాడు.

Advertisement

Next Story

Most Viewed