- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫేస్ వాష్ చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి..!
దిశ, ఫీచర్స్: సాధారణంగా ప్రతీ ఒక్కరూ చర్మంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. స్కిన్‌పై ఎలాంటి మచ్చలు, మొటిమలు లేకుండా కాంతివంతంగా ఉండాలని అనుకుంటారు. దీని కోసం రకరకాల బ్యూటీ క్రీమ్స్ వాడుతుంటారు. కానీ, చిన్న పొరపాట్ల కారణంగా ముఖ కాంతిని కోల్పోతారు. ముఖ్యంగా ఫేస్ వాష్ చేసేటప్పుడు. నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి.
ఈ తప్పులు చేయకండి:
చేతులను శుభ్రం చేసుకోవాలి: ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. చేతులపై ఉండే బ్యాక్టీరియాతో ముఖాన్ని కడగడం వల్ల చర్మానికి హాని కలుగుతుంది.
ఓవర్ వాష్: ముఖాన్ని రోజుకు రెండు సార్లు కంటే ఎక్కువగా కడగడం వల్ల చర్మం సహజ తేమను కోల్పోతుంది. దీని వల్ల స్కిన్ పొడిగా, గరుకుగా మారుతుంది.
గోరువెచ్చని నీరు: ముఖాన్ని ఎప్పుడూ గోరు వెచ్చని నీటితో కడగాలి. బాగా వేడి లేదా చల్లటి నీటితో కడగడం వల్ల చర్మం పొడిబారుతుంది. సున్నితమైన చర్మతత్వం ఉన్న వారు మాత్రం వేడి నీటిని ఉపయోగించకూడదు.
సబ్బు: చాలామంది ఫేస్ వాష్ చేయడానికి సాధారణ సబ్బును ఉపయోగిస్తారు. ఇది చర్మంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. చర్మాన్ని నిర్జీవంగా మారుస్తుంది. సబ్బు కాకుండా ఏదైనా ఫేస్ వాష్‌ను ఉపయోగించడం మంచిది.
గట్టిగా స్క్రబ్ చేయడం: ఫేస్ వాష్ చేసేటప్పుడు గట్టిగా ముఖాన్ని రుద్దుతూ వాష్ చేయకూడదు. అలా చేయడం వల్ల చర్మంపై పగుళ్లు ఏర్పడతాయి.
సరైన ఫేస్ వాష్: చర్మతత్వాన్ని బట్టి ఫేస్ వాష్‌ను ఉపయోగించడం మంచిది. సున్నితమైన చర్మం ఉన్న వ్యక్తులు సువాసన లేని, హైపోఅలెర్జెనిక్ ఫేస్ వాష్‌లను ఉపయోగించడం మంచిది. గాఢత ఎక్కువగా ఉన్న ఫేస్ వాష్‌లను ఉపయోగించడం వల్ల చర్మంపై మంట, దురద వంటి సమస్యలు వస్తాయి.