- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Dog Temple : కుక్కలకు గుడి కట్టిన గ్రామస్థులు.. ఎక్కడంటే?
దిశ, ఫీచర్స్: సాధారణంగా ఎక్కడైనా దేవతలకు గుడి కడుతారు. లేదా సమాజానికి చేసిన సేవలు చూస్తే వారి పేరిట ఆలయాలు నిర్మిస్తారు. కానీ ఓ గ్రామంలో కుక్కలకు గుడి కట్టారు. అంతేకాకుండా ఇవి తమ ఆరాధ్య దైవమంటూ నిత్యం పూజలు చేస్తున్నారు. సంవత్సరానికి ఓసారి ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఎక్కడా లేని విధంగా ఇక్కడ శునకాలను పూజించడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. అంతేకాకుండా ఆ ఆలయం నిర్మించడానికి ఓ చరిత్ర ఉంది. ఇంతకీ ఈ కుక్కల ఆలయం ఎక్కడ ఉంది? దాని వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
కర్ణాటక రాష్ట్రంలోని చన్నపట్న జిల్లాలో అగ్రహార వలగెరెహల్లి అనే గ్రామంలోని ఓ ఆలయంలో దేవుళ్లకు బదులు శునకాల విగ్రహాలు ఉన్నాయి. అయితే కుక్కల కోసం ప్రత్యేకంగా ఆలయం కట్టడం వెనుక ఓ చరిత్ర ఉంది. గ్రామంలో ఎప్పుడూ తిరిగే రెండు శునకాలు ఒక్కసారిగా మాయమయ్యాయి. దీంతో ఇవి చనిపోయాయని గ్రామస్థులు అనుకున్నారు. కానీ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కలలో ఓ దేవత కనిపించి గ్రామస్థుల రక్షణ కోసం తప్పిపోయిన కుక్కల కోసం ఓ ఆలయాన్ని నిర్మించాలని తెలిపింది. దీంతో దేవత చెప్పిన ప్రకారం ఇక్కడ 2010లో ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో ప్రతి ఏడాది భారీ ఉత్సవాలు కూడా చేస్తారంట. ఆ గ్రామాన్ని ఈ కుక్కలే కాపాడుతున్నాయని గ్రామస్థులు భావిస్తారు. అంతేకాకుండా ఇక్కడున్న ఇళ్లల్లో ఉండే ప్రతికూల వాతావరణం తొలగిపోతుందని భావిస్తారు.