Stress :మానసిక ఒత్తిడి ఊబకాయానికి దారి తీస్తుందా.. నిపుణులు ఏమంటున్నారంటే?

by Jakkula Samataha |
Stress  :మానసిక ఒత్తిడి ఊబకాయానికి దారి తీస్తుందా.. నిపుణులు ఏమంటున్నారంటే?
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం చాలా మంది యువత ఎదుర్కొంటున్న సమస్యల్లో మానసిక ఒత్తిడి ఒకటి. జీవితంలో తాము కోరుకున్నది జరగకపోయినా, బాధాకరమైన సమస్యలు ఏర్పడిన, కుటుంబంలోని సమస్యలు, ఉద్యోగం, మంచి చదువు, లవ్ ఫెయిల్యూర్ ఇలా చాలా సంఘటనలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. దీంతో ఆ వ్యక్తి ఎప్పుడూ అనారోగ్య సమస్యలు, చికాకు, అలసట, చిరాకు, చిన్న విషయానికి కోపానికి గురి కావడం లాంటిది జరుగుతుంది. అంతే కాకుండా మానసిక ఒత్తిడి వలన అతిగా ఆలోచించడం, ఆలోచనల్లోనే ఎక్కువ సమయం గడపడం, ఒంటరిగా ఉండాలని అనుకోవడం, శారీరక శ్రమ, వేరే ఇతర పనులపై ఆసక్తి చూపకపోవడం, అతిగా తినడం, నిద్ర లేమి వంటి సమస్యలు ఏర్పడుతాయి. అయితే చివరకు ఈ చిన్న సమస్యలే ఊబకాయానికి కూడా దారి తీస్తాయంట. మానసిక ఒత్తిడి అనేది వ్యక్తి పూర్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీంతో అధిక రక్తపోటు, గుండె సమస్యలు, ఊబకాయం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది అంటున్నారు నిపుణులు.

అందుకే అలాంటి వారు ప్రతి రోజూ వ్యాయామం, ధ్యానం చేస్తూ గడపాలంట. ఇష్టమైన ఆహారాన్ని వండుకుని తినడం, స్నేహితులతో సరదాగా గడపడం చేయాలంట. దీని వలన కాస్త రిలీఫ్ ఉంటుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ( నోట్ : పై వార్త నిపుణులు, ఇంటర్నెట్‌లోని సమాచారం మేరకు ఇవ్వబడినది, దిశ దీనిని ధృవీకరించలేదు)

Advertisement

Next Story

Most Viewed