పచ్చిమిర్చి తింటే అందం పెరుగుతుందా.. దీనిలో వాస్తవమెంత?

by Prasanna |
పచ్చిమిర్చి తింటే అందం పెరుగుతుందా.. దీనిలో వాస్తవమెంత?
X

దిశ, ఫీచర్స్ : పచ్చి మిర్చిలో మన శరీరానికి కావల్సిన అనేక విటమిన్లు ఉంటాయి. ముఖ్యంగా, ఇందులో విటమిన్ సి, రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. దీనిలో ఉండే విటమిన్ ఎ, ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడి దృష్టిని మెరుగుపరుస్తుంది. పచ్చి మిరపకాయలో లుటిన్, జియాక్సంతిన్ ,యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉన్నాయని పరిశోధకలు పలు పరిశోధనలు చేసి వెల్లడించారు.

మన శరీరంలో రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. అలాగే ఇది ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ఇది జలుబుకి కి కూడా చెక్ పెడుతుంది.

పచ్చిమిర్చిలో ఉండే పోషకాలు చర్మానికి అందమైన మెరుపునిస్తాయి. దీని వలన అందం కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇవి ముఖంపై మచ్చలను తగ్గిస్తాయి. నిపుణులు పరిశోధనలు చేసి ఇవి అందాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని గుర్తించారు. అందుకే కొంత మంది రెండు మూడు రోజులకొకసారి పచ్చిమిర్చి చట్నీ తింటుంటారు. అలాగే మిరపకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మీ శరీరంలోని అంతర్గత అవయవాలను శుభ్రపరచడం ద్వారా క్యాన్సర్ రాకుండా చేస్తుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed