రాత్రి వేళ ఈ పండ్లను తినొద్దని చెబుతున్న వైద్యులు.. ఎందుకంటే..?

by Prasanna |
రాత్రి వేళ ఈ  పండ్లను తినొద్దని చెబుతున్న వైద్యులు.. ఎందుకంటే..?
X

దిశ, ఫీచర్స్ : మనలో కొంతమంది పండ్లను ఎక్కువగా తీసుకుంటారు. ఎందుకంటే ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలా అని మనకి నచ్చిన సమయంలో తీసుకోకూడదు. వీటిని తినడానికి కూడా ఒక సమయం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

మీరు పండు తినడానికి ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది. వీటిని టైమ్ ప్రకారం తినాలని, లేకుంటే ఆరోగ్యానికి హాని కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాత్రి పూట పడుకునే ముందు వీటిని తినకపోవడమే మంచిది. ద్రాక్ష రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కానీ పడుకునే ముందు తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచి కాదు. వీటిలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది.దీని వలన గుండె సమస్యలు వస్తాయి.

పడుకునే ముందు పుచ్చకాయ తినడం హానికరం అంటున్నారు నిపుణులు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, సాయంత్రం పూట పుచ్చకాయ తినడం వల్ల అదే పనిగా మూత్ర విసర్జన చేస్తుంటారు. ఈ కారణంగా, మీకు నిద్రలేమి సమస్య వస్తుంది. ఆరెంజ్ శరీరానికి మంచిది, ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కానీ రాత్రిపూట తినడం హానికరమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Next Story