డాక్టర్ నిర్లక్ష్యం.. రోగి తలకు రంధ్రం చేసిన కూతురు.. అసలు ఏం జరిగిందంటే..

by Sujitha Rachapalli |
డాక్టర్ నిర్లక్ష్యం.. రోగి తలకు రంధ్రం చేసిన కూతురు.. అసలు ఏం జరిగిందంటే..
X

దిశ, ఫీచర్స్ : ఓ యాక్సిడెంట్ లో 33 ఏళ్ల వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ట్రీట్మెంట్ కోసం ఆస్పత్రికి తరలించగా.. అత్యవసర శస్త్రచికిత్స అవసరమైంది. ఈ సమయంలో అక్కడున్న డాక్టర్ పేషెంట్ కు ఆపరేషన్ చేసేందుకు సిద్ధమైంది. ఆపరేషన్ థియేటర్ లోకి తనతోపాటు తన 13 ఏళ్ల కుమార్తెను కూడా తీసుకుపోయింది. ఆపరేషన్ చేసేందుకు అనుమతించింది.

శస్త్రచికిత్స సక్సెస్ అయినట్లు డాక్టర్స్ నివేదించారు. కానీ పేషెంట్ మాత్రం హీల్ కాకపోగా.. అసలు రియాక్షన్ లేకుండా అయిపోయాడు. దీంతో ఏం జరిగిందని ఆరా తీస్తే డాక్టర్ కూతురు ఆ రోగి తలకు రంధ్రం చేసినట్లు నివేదించారు నిపుణులు. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్ అవుతుండగా.. విచారణ తర్వాత.. డాక్టర్ తో పాటు మరో ఇద్దరు సిబ్బంది ఆసుపత్రి నుంచి సస్పెండ్ చేయబడ్డారని తెలుస్తుంది.

Advertisement

Next Story