MISS YOU : మీ లవర్ మిమ్మల్ని మిస్ అవ్వాలని అనుకుంటున్నారా? ఈ టిప్స్ ఫాలో అవండి..

by Sujitha Rachapalli |
MISS YOU : మీ లవర్ మిమ్మల్ని మిస్ అవ్వాలని అనుకుంటున్నారా? ఈ టిప్స్ ఫాలో అవండి..
X

దిశ, ఫీచర్స్ : మీ లవర్ మిమ్మల్ని మిస్ అవుతున్నట్లు చేయాలని అనుకుంటున్నారా? తనపై గాఢమైన ముద్ర వేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ సైకలాజికల్ ట్రిక్స్ ఫాలో కావాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇలా చేస్తే కచ్చితంగా మీరు అనుకున్నది జరుగుతుందని చెప్తున్నారు. మీరు దగ్గర లేనప్పుడు మరింత మిస్ అయ్యేలా చేయొచ్చని సూచిస్తున్నారు. ఇంతకీ అవేంటో తెలుసుకుందాం.

మీ సువాసన

ప్రతి వ్యక్తి శరీరంలో ప్రత్యేకమైన వాసన ఉంటుంది. ఇతరులకు అదే ఫ్రాగ్రెన్స్ తో గుర్తుండిపోతారు. దూరంగా వెళ్ళినా సరే ఆ స్మెల్ గుర్తొస్తుంది. మైమరచి పోయేలా.. మళ్లీ మళ్లీ గుర్తుకు తెచ్చుకునేలా ఉంటుంది. అందుకే అలాంటి ప్రత్యేక సువాసన కలిగి ఉన్నట్లయితే.. మీ భాగస్వామి మిమ్మల్ని చాలా మిస్ అవుతారు. మీరు పక్కన ఉంటే బాగుండేదని కోరుకుంటారు.

మిస్టరీగా ఉండటం

ఇంట్రోవర్ట్స్ చాలా తక్కువగా మాట్లాడుతారు. ఎక్కువ సీక్రెట్స్ మెయింటేన్ చేస్తారు. వారు ఏది మాట్లాడినా స్పెషల్ అండ్ అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. అందుకే మీ లైఫ్ లో జరుగుతున్న ప్రతి విషయాన్ని షేర్ చేసుకోకుండా.. మీ జీవితంపై ఇంట్రెస్ట్ కలిగించే సంఘటనలు పంచుకోండి. ఒక సెన్స్ ఆఫ్ మిస్టరీగా అనిపించేలా చేయండి. అప్పుడు తనకు మీ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మీరు పక్కన లేనప్పుడు ఏం చేస్తుందనే కురియాసిటీ పెరుగుతుంది. మిమ్మల్ని మిస్ అవుతారు. అంతేకాదు మీ భాగస్వామిని కూడా తన గురించి అడగండి. తను చెప్పేది ఇంట్రెస్టింగ్ గా వినండి.

సోషల్ మీడియా స్టేటస్

మీ విషయాల పట్ల ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్న వారిని మరింత మిస్ అయ్యేలా చేయాలంటే.. ప్రస్తుతం ఉన్న ఆయుధం సోషల్ మీడియా. మీరు ఆ రోజు ఏం చేస్తున్నారు.. ఎవరెవరిని కలిశారు.. ఎంత సంతోషంగా ఉన్నారు.. అనే అప్ డేట్స్ ఇస్తూ వెళ్ళండి. పూర్తిగా కాకుండా బ్రీఫ్ గా స్టేటస్ లేదా స్టోరీస్ రూపంలో పెట్టండి. కచ్చితంగా అవతల ఉన్న వ్యక్తి మీతో జాయిన్ అయితే బాగుండు అని కోరుకుంటారని చెప్తున్నారు నిపుణులు.

మీ వస్తువును వదిలేయండి

మీ ప్రెజెన్స్ గురించి ప్రతి నిమిషం ఆలోచించాలంటే మీకు సంబంధించిన వస్తువును విడిచి వెళ్లమని సూచిస్తున్నారు నిపుణులు. మీరు ఎప్పుడైనా గుర్తించారా ఒక్క అబ్బాయితో స్పెండ్ చేసిన అమ్మాయి మళ్ళీ కలవాలని అనుకుంటే తన చెవి కమ్మలను అక్కడే వదిలి వెళ్తుందట. సైకాలాజీ ప్రకారం ఇది కచ్చితంగా వర్క్ అవుట్ అవుతుందని చెప్తున్నారు నిపుణులు.

Advertisement

Next Story