- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎడమవైపున నిద్రిస్తున్నారా...అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..!
దిశ, వెబ్‌డెస్క్: నిద్రించే భంగిమ కూడా మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని మీకు తెలుసా? ముఖ్యంగా ఎడమవైపు పడుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవి ఏంటో తెలుకుందామా...
* జీర్ణక్రీయను మెరుగుపరచడం..
ఎడమవైపు పడుకోవడం వల్ల మీ పేగుల నుంచి వ్వర్థాల సహజ ప్రవాహాన్ని ప్రోత్సహించడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే మీరు ఎడమవైపు నిద్రిస్తున్నప్పుడు మీ కడుపు, ప్యాంక్రియాస్ స్థానం మీద ప్రభావం ఉంటుంది. ఇది యాసిడ్ రిఫ్లక్స్, హృదయంలో మంట ప్రమాదాన్ని తగ్గించడంలో మేలు చేస్తుంది.
* వెన్ను నొప్పి నుంచి ఉపశమనం పొందడం..
వెన్ను నొప్పితో బాధపడున్నవారు ఎడమవైపు పడుకోవడం వల్ల నొప్పిని తగ్గించే అవకాశాలు ఉన్నాయి.
ఎందుకంటే ఈ రకం నిద్ర మీ వెన్నెముక సహజ వక్రతను అనుమతిస్తుంది. ఇది మీ వెనక ఒత్తిడిని తగ్గిస్తుంది.
* గుండె ఆరోగ్యాన్ని పెంచడం..
ఎడమవైపు పడుకోవడం వల్ల మీ గుండెపై ఒత్తిడిని తగ్గుతుంది. రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. ఎడమవైపు నిద్ర గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎందుకంటే గుండె మీ శరీరానికి ఎడమవైపు ఉంటుంది. కాబట్టి అలా నిద్రించడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
*గురకను తగ్గించడం..
మీ ఇంట్లో ఎవరైనా గురక పెట్టినట్లయితే ఎడమ వైపున నిద్రించమని సలహాలు ఇవ్వండి. ఇలా పడుకుంటే శ్వాసనాళాలు తెరిచి ఉంచడం ద్వారా గురకను తగ్గించడంలో సహాయపడుతుంది. గర్భిణులు ఎడమవైపుకు తిరిగి పడుకోవడం చాలా మంచిది. కడుపులో పిండానికి, మూత్ర పిండాలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
*శోషరస వ్యవస్థ పనితీరు మెరుగుపరచడం..
శరీరం నుంచి వ్యర్థాలు, విషాన్ని తొలగించడం శోషరస వ్యవస్థ పని. ఎడమవైపు ఉన్న శోషరస కణుపులను మరింత సమర్థవంతంగా ఉంచడానికి అనుమతించడం ద్వారా మీ శోషరస వ్యవస్థ పనితీరును ప్రోత్సహించడంలో మేలు చేస్తుంది. మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.. ఎడమవైపున నిద్రించడానికి ప్రయత్నించండి.
Also Read...
బిడ్డ పేరు మార్చాలని అధికారుల డిమాండ్.. కోర్టు మెట్లెక్కిన తల్లిదండ్రులు