చదువు విషయంలో మీ పిల్లలను చులకనగా చూస్తున్నారా? అలా చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.

by Kavitha |
చదువు విషయంలో మీ పిల్లలను చులకనగా చూస్తున్నారా? అలా చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.
X

దిశ, ఫీచర్స్ : థామస్ ఆల్వా ఎడిసన్... ఈ పేరు ప్రతి ఒక్కరికి బండ గుర్తు ఎందుకంటే ఇప్పుడు మనందరి ఇళ్లల్లో బల్బులు వెలుగుతున్నాయి అంటే కారణం అతనే. ఈ బల్బు కనిపెట్టే ప్రయాణంలో అతను వందల సార్లు ఫెయిల్ అయ్యాడు. అయినా కూడా మళ్లీ మళ్లీ ప్రయత్నం చేసి విజయాన్ని అందుకున్నాడు. కానీ అతని ఒక పనికిరానివాడని, చదువు రానివాడని స్కూల్లో టీచర్లు పక్కన పెట్టారు.

ఒక రోజు ఓ చిన్నపిల్లడైనా ఎడిసన్ ఇంటికి వచ్చి తన తల్లికి ఒక లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్ స్కూల్లో తన టీచర్ ఇచ్చారని చెప్పాడు. అప్పటికి ఇంకా ఎడిసన్ కి చదవడం రాదు. ఆ లెటర్ అమ్మకు ఇచ్చి ‘అమ్మా... ఇందులో ఏముందో చదువు’ అని అడిగాడు. వాళ్ళ అమ్మ ఆ లెటర్ తీసి చదివింది.. అందులో ‘మీ కుమారుడు జీనియస్. అతనికి అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి. అంతటి మేధా శక్తి ఉన్న వాడికి చదువు చెప్పలేము’ అని రాశారని వారి తల్లి చదివి వినిపించింది. అది విన్న థామస్ చాలా ఆనందపడ్డాడు. మరుసటి రోజు నుంచి స్కూలు కి వెళ్లడం మానేశాడు. అతని తల్లి దగ్గరే చదువు నేర్చుకోవడం మొదలుపెట్టాడు. దీంతో అతని తల్లి చాలా విషయాలు బోధించింది.. అలా ఎడిసన్ ప్రతి ఒక విజయం వెనుక ఉన్నది తన తల్లి.

కానీ ఎడిసన్ ఓ రోజు ఇల్లు శుభ్రం చేస్తుంటే ఓ ట్రంకు పెట్టెలో తన టీచర్ ఇచ్చిన పాత ఉత్తరం దొరికింది. అది తీసి చదివాడు థామస్. అందులో ‘మీ కొడుకు చాలా బలహీనుడు. అతనికి చదువు రాదు. మీ అబ్బాయికి మేము చదువు చెప్పలేము. దయచేసి మీ అబ్బాయిని స్కూలుకి పంపించకండి’ అని ఉంది. అది చదవగానే థామస్ కళ్ళలొ నీళ్ళు తిరిగాయి. ఒకవేళ కనుక తన తల్లి ఆ లెటర్ ను మార్చి చదవకపోతే, ఎడిసన్ ఇంత గొప్పవాడిని అయ్యేవాడు కాదు. తన తల్లి కొడుకు మానసిక ధైర్యాన్ని దెబ్బతీయకూడదు లెటర్ మార్చి చదివి.. తన కోడుకుని అంతటి ప్రయోజకుడిని చేసింది. ఇప్పుడు ఈ కథ చెప్పడానికి కారణం ఏంటి అంటే ఈ ఒక్క థామస్ తల్లే కాదు. అందరూ పిల్లల తల్లిదండ్రులు ఇలాగే ఉండాలి. పిల్లలు చదవలేదని చాలా బాధపడేవారు పేరెంట్స్.

అలా బాధ పడటం వల్ల ఏమీ రాదు.. మరి కొంత మంది పిల్లలకు చెప్పడం చేతకాక చేయి చెసుకుంటారు. అలా చేస్తే వారు ఇంకా మొండిగా తయారవుతారు. కొట్టి మీ మనసు నోప్పించుకోవడం కంటే మీ పిల్లాడు ఎందుకు వెనుకబడుతున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ‘నువ్వు చదవవు, నీకు ఏమీ రాదు, నువ్వు పనికిమాలిన వాడివి’ ఇలాంటి మాటలు మీ పిల్లలను అనడం మానేయండి.

ముఖ్యంగా ఇతరుల పిల్లల ముందు మీ పిల్లలను చులకన చేసి మాట్లాడకూడదు . అది వారి చిన్ని హృదయాన్ని గాయపరుస్తాయి. మనోవేదనకు గురి చేస్తాయి. అప్పుడు మీమీద ఉన్న ఇష్టం, ప్రేమ కూడా పోయే వారి దృష్టిలో మీరు శత్రువులుగా మారిపొతారు. మీకు ఎదురు తిరుగుతారు. పిల్లల నుండి ఇలాంటి పరిణామాలు ఎదురుకోవడం తల్లిదండ్రులకు చాలా కష్టం గా ఉంటుంది. కనుక ఏ విషయం అయిన పిల్లల్ని కొట్టి తిట్టి కాకుండా . ప్రేమతో అడిగి తెలుసుకోండి. మీరు చూపించే ప్రేమ.. నమ్మకం వారిని ఉన్నతస్థాయికి చేర్చుతుంది.

కొంత మంది పిల్లలకు చదువు రాకపోయిన వారిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అది ఏంటి అనేది తల్లిదండ్రులు గుర్తించండి. అంతే కానీ పిల్లల లోపాలను చూపి కించపరచడం, వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం మాత్రం మానేయండి ఇలా చేస్తే వారు కుంగిపోతారు. అంతేకాదు మీ పిల్లలను మీరు పూర్తిగా కోల్పోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఓతిడికి లోనై వారికి సూసైడ్ థాట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

పైన చెప్పిన విషయాలు గమనించి ఒకసారి మీ పిల్లల్ని గమనించండి. వారికి ఎలాంటి విషయాలు అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కనుగొని. వారిని విజయం వైపు అడుగులు వేయించండి.


Advertisement

Next Story

Most Viewed