మీకు మీరు గిలిగింతలు పెట్టుకుంటే ఎందుకు నవ్వు రాదో తెలుసా?

by Jakkula Samataha |
మీకు మీరు గిలిగింతలు పెట్టుకుంటే ఎందుకు నవ్వు రాదో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : చెక్కిలిగింతలు పెడుతుంటే వచ్చే నవ్వు ఆపుకోవడం చాలా కష్టం.చిన్న పిల్లు దేనికోసమైనా అలిగినప్పుడు పేరెంట్స్ వారికి కిత కితలు పెట్టి నవ్విస్తారు. అంతే కాకుండా ఒకరికి ఒకరు చెక్కిలి గింతలు పెట్టుకొని నవ్వుతారు. ఆ సరదా సందర్భం అందరికీ సంతోషాన్ని ఇస్తుంది.

కొంత మంది స్నేహితులు, తన మిత్రుడికి తెలియకుండానే చెక్కిలి గింతలు పెట్టి నవ్విస్తాడు. అయితే వేరే వాళ్లు మనకు చెక్కిలి గింతలు పెడితే నవ్వు వస్తుంది. కానీ మనకు మనంగా గిలిగింతలు పెట్టుకుంటే అస్సలు నవ్వురాదు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది. దీని వెనుకున్న అసలు రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మన మెదడులో సెరిబెలం అనేది ఉంటుందంట. ఇది స్వీయ చర్యలను పసిగడుతుంది. దీంతో మన శరీర భాగాలతో మనం ఏది చేసినా, దానికి తెలిసిపోయి నవ్వు రాదంట. అదే ఇతరులు కితకితలు పెట్టడం మనకు తెలియదు. దీంతో సెరిబెలం రియాక్టై చర్యకు ప్రతి చర్య జరిగుతుంది. అలా మనం మనకు తెలియకుండానే చలాకిగా నవ్వుతాం.

Advertisement

Next Story

Most Viewed