- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గాజులకు, గర్భాశయానికి సంబంధం ఏంటి..? డాక్టర్లు చెప్పింది ఇదే..!
దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు ఎక్కువగా ఇష్టపడే ఆభరణాల్లో గాజులు కూడా ఒకటి. అమ్మాయిలు గాజులు వేసుకోవడం వలన వారి చేతికి అందం పెరగడమే కాదు.. ఎన్నో మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. గాజులను మహిళలు ధరించడం సనాతన భారతీయ సంప్రదాయాలలో ఒక సాంప్రదాయం. ఇప్పటికీ ఈ ఆచారం అనాదిగా కొనసాగుతూనే ఉంది. అందుకేనేమో అప్పుడే పుట్టిన పసిపిల్లల నుంచి పండు ముదుసలి వరకు గాజులను ధరిస్తారు. హిందూ సాంప్రదాయంలో గాజులు ధరించడం అయిదోతనానికి గుర్తుగా చెప్పుకుంటారు. ముతైదువకు ఉండే ఐదు లక్షణాలలో గాజులు ఒకటిగా పేర్కొంటారు. అందుకే పెళ్లైన ప్రతి ఒక్క స్త్రీ తన రెండు చేతులకు నిండుగా గాజులను వేసుకుంటారు. ఎక్కడ తిరునాల్లు, జాతర జరిగినా తప్పని సరిగా కన్పించేవి గాజులమ్మే దుఖాణాలే. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మొదటగా వేసే ఆభరణం గాజులే. ఏదైనా కార్యం మీద బయటకు వెళ్ళునప్పుడు గాజులమ్మేవారు కాని, మట్టిగాజులు ధరించిన స్ర్తీ ఎదురుగా వస్తే శుభసూచకమని, వెళ్లే కార్యం జయప్రదంగా జరుగుతుందని భావిస్తారు.
కానీ ఇప్పుడున్న కాలంలో చేతులకు గాజులను వేసుకోవడం అంటేనే నామోషీగా ఫీలవుతున్నారు నేటి యువతులు. ఏదో పేరుకి చేతికి కనిపించి కనిపించనట్టుగా ఉండే ఒక సన్నని గాజును వేసుకుంటున్నారు. కొంత మంది మహిళలు అయితే దాన్ని కూడా వేసుకోవడానికి వెనకాడుతున్నారు. ఆఫీసులకు వెళ్లే ఆడవారు మాత్రం ఒక చేతికి వాచ్‌ను మాత్రమే ధరిస్తున్నారు. పెళ్లిళ్లు, పండగలు, ఫంక్షన్లకు మాత్రమే గాజులను వేసుకుంటున్నారు.
ఏ ప్రాంతంలో ఏ గాజులకు ప్రాధాన్యత ఇస్తారు..
గాజులను ఒక్కో ప్రాంతానికి చెందిన వారు ఒక్కో కరమైన గాజులకు ప్రాధాన్యతను ఇస్తారు. సిక్కులు తమ మతాచారంలో లోహంతో చేసిన గాజులను ధరిస్తారు. పంజాబ్‌లో వధువులు పెళ్ళికి 21 రోజుల ముందు నుండి కాని, లేదా పెళ్ళి తరువాత సంవత్సరం వరకు ఏనుగు దంతంతో చేసిన గాజులని ధరించడం సంప్రదాయంగా వస్తుందట. ఉత్తర ప్రదేశ్‌లో పెళ్ళికూతురు ఎర్రచీర, ఎర్రగాజులు ధరించడానికి ప్రాధాన్యతను ఇస్తారట. మహారాష్ట్రలో, కర్నాటకలో, ఆంధ్రలో పెళ్ళి సమయంలో నవవధువు పచ్చగాజులు ధరించడం ఆనవాయితీ వస్తుంది. ఆకుపచ్చ రంగుకు హిందూ వివాహాలకు విడదీయరాని సంబంధం ఉంది. రాజస్తాన్ వివాహిత స్త్రీలు భర్త ఉన్నంత కాలం మణికట్టు నుంచి, ముంచెయ్యి వరకు ఏనుగు దంతంతో చేసిన గాజులు ధరిస్తారట. అలా ధరించడం వలన తన కుటుంబానికి, భర్తకు, సంతానానికి శుభం కలుగుతుందని వారి నమ్మకం.
పశ్చిమ బెంగాల్‌లో చిన్న గవ్వలు లేదా ఎర్ర పగడాలతో చేసిన గాజులను చేతులకు వేసుకొవడం పెళ్లయిన ఆడవారికి ఆచారంగా ఉందట. నేటికి ఆదివాసి, గిరిజన స్త్రీలు చేతులకు నిండుగా, ముంజేతి వరకు తెల్లటి, వెడల్పాటి చెక్కతో లేదా వెదురుతో చేసిన గాజులు ధరించడం గమనించవచ్చు. స్త్రీ దేవరామూర్తులకు ఎర్రగాజులను భక్తులు కానుకగా, మూడుపులుగా సమర్పిస్తారు. దక్షిణ భారతదేశంలో స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు, పుట్టింటి వారు శ్రీమంతంలో ఒకచేతికి 21 గాజులు, మరోచేతికి 22 గాజులు తొడుగుతారు. ఇక అప్పుడే పుట్టిన చిన్నపిల్లలకు నల్లగాజులు వేయడం వల్ల ఎలాంటి దోషాలు, దిష్టి తగలకుండా రక్షణగా ఉంటాయని నమ్ముతుంటారు.
ఏ రంగు గాజులు దేనికి సూచిక..
కొంతమంది మహిళలు ఏ రంగు చీరను కడితే అదే రంగు గాజులకు ధరిస్తుంటారు. గాజులలో కూడా ఒక్కరంగు కాకుండా ఎన్నో రంగులు ఉంటాయి. మరి ఏ రంగు గాజులు దేన్ని సూచిస్తున్నాయి అన్న విషయానికొస్తే...
తెలుపు రంగు గాజులు ప్రశాంతతను కల్పిస్తుంది
నలుపు రంగు గాజులు అధికారాన్ని సూచిస్తుంది
పసుపు రంగు గాజులు సంతోషాన్ని కలిగిస్తుంది
ఆకుపచ్చ రంగు గాజులు అదృష్టాన్ని తీసుకువస్తుందని నమ్మకం
ఊదారంగు గాజులు స్వేచ్ఛను సూచిస్తుంది
ఎరుపు రంగు గాజులు శక్తిని సూచిస్తుంది
నీలిరంగు గాజులు విఙ్ఞానానికి ప్రతీక
నారింజ రంగు గాజులు విజయాన్ని చేకూరుస్తాయి
వెండి గాజులు బలాన్ని చేకూరుస్తాయి
బంగారు గాజులు ఐశ్వర్యాన్ని సూచిస్తాయి.
గాజులు వేసుకోవడం వలన కలిగేలాభాలు... సైంటిఫిక్ రీజన్..
గాజులు అనేవి అలంకరణకు మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. అయితే గాజులు వేసుకోవడం వలన కొన్ని అనారోగ్య సమస్యలు దూరం అవ్వడానికి ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా అనే విషయంపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఈ పరిశోధనలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలువడ్డాయని తెలుస్తోంది. స్త్రీలు గాజులు ధరించడం వలన శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. చేతులు అటూ ఇటూ కదలించినప్పుడు గాజులు వెనక్కీ ముందుకు కదిలి మణికట్టు భాగంగా మసాజ్‌లా అవుతుందట. దాంతో మణికట్టు భాగం నుంచి రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. అంతే కాదు గర్భాశయం నాడులు కూడా చురుగ్గా పనిచేస్తాయట. గర్భాశయ నాడులు మణికట్టు ముంజేతికి మధ్య ఉండి అనుసంధానమై ఉంటాయట. చేతిగాజులు కదిలినప్పుడు మహిళల మణికట్టునాడులు కాస్త ఒత్తిడికి గురవుతాయి. దీంతో గర్భాశయనాడులు ఉత్తేజితమై గర్భాశయం పనితీరు సవ్యంగా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు.
అంతే కాదు గాజులు వేసుకుంటే అలసట తగ్గి శరీరంలో శక్తి పెరుగుతుందట. అలాగే మట్టి గాజులను ఎక్కువగా ధరించడం వలన శరీరంలో ఉండే అధిక వేడిని తొలిగిస్తాయట. అందుకే ఎన్ని బంగారు గాజులను వేసుకున్నా నాలుగు మట్టిగాజులనైనా వేసుకోవాలని పెద్దలు చెబుతున్నారు. ఇక ఈ మధ్యకాలంలో మహిళల్లో ఎక్కువగా వస్తున్న సమస్య హార్మోన్ల అసమతుల్యత. మట్టిగాజులు వేసుకోవడం వలన ఆ సమస్యను కూడా నివారించవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. చూశారుగా గాజుల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.
Also Read...
గాజులకు, గర్భాశయానికి సంబంధం ఏంటి..? డాక్టర్లు చెప్పింది ఇదే..!