వివాహంలో అల్లుడి కాళ్లు మామ ఎందుకు కడుగుతారో తెలుసా..?

by sudharani |
వివాహంలో అల్లుడి కాళ్లు మామ ఎందుకు కడుగుతారో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: అంగరంగ వైభవంగా చేసుకునే పెళ్లి అయినా.. తూతూ మంత్రంగా జరిగే పెళ్లి అయినా.. పెళ్లి తంతు మాత్రం ఒకే విధంగా ఉంటుంది. అయితే వివాహంలో కన్యాదానం అనేది ప్రధాన తంతు. దీనిలో మామ అల్లుడి కాళ్లు కడిగే సంప్రదాయం ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ.. అసలు అల్లుడు కాళ్లు మామ ఎందుకు కడగాలి దాని వెనుక ఉన్న రహస్యం ఏంటో చాలా తక్కువ మందికే తెలుసు.

అయితే అల్లుడు కాళ్లు మామ కడగడం వెనుక ఓ అర్థం ఉంది. మండపానికి పడమటి దిశలో పెళ్లి కొడుకు కూర్చుని ఉంటే.. కన్యాదాత అయిన మామ.. అల్లుడి కుడి కాలు తర్వాత ఎడమ కాలిని కడిగి, ఆ నీటిని తలపైన చల్లుకుంటారు. దీని వెనుక ఉన్న అర్థం ఏమిటంటే.. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురిని ధర్మ, అర్థ, కామ మోక్షాలకై నీకు అర్పిస్తున్నానంటూ.. పెళ్లి కుమారుడిని శ్రీమన్నారాయణుడిగా, బిడ్డను లక్ష్మీదేవిగా భావించి అల్లుడి కాళ్లు కడుగుతారు.

Advertisement

Next Story

Most Viewed