ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా..!

by Hamsa |   ( Updated:2023-03-13 13:50:33.0  )
ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా..!
X

దిశ, వెబ్‌డెస్క్: నూతన సంవత్సరం తర్వాత హిందువులు మొదటగా జరుపుకునే పండుగ ఉగాది. తెలుగుదనం ఉట్టిపడేలా ఈ పండుగను కుటుంబంతో ఎంతో సంతోషంగా చేసుకుంటారు. ఈ పండుగను ఒక్కో ప్రదేశంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. కాగా, ఉగాదికి అర్థం ఉగ అంటే నక్షత్ర గమనం మొదలైనటువంటి మొదటిరోజు ఉగాది. వసంత మాసంలో వచ్చే ఈ పండుగను అన్నీ సహజ సిద్ధంగా దొరికే వేప పువ్వులు, మామిడికాయ, బెల్లం, కొబ్బరి, అరటి పండ్లు, ఉప్పు, కారం, ఇలా చెడ్ రుచులతో ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటారు. రైతులు కొత్త పంటలను వేసి, కొత్త జీవితానికి నాందిగా ఉగాది వేడుకను జరుపుకుంటారు.

తెలుగువారు కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరు తమ రాశి ఫలాల సమాచారాన్ని తెలుసుకొని ముందుకు సాగుతారు. అయితే ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారో ఇక్కడ తెలుసుకుందాం. భారతీయ పురాణాల ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి ఉగాది రోజున బ్రహ్మ సృష్టిని సృష్టించాడని భారతీయులు బలంగా నమ్ముతారు. అలాగే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి సోమకుడుని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు కూడా ఇదే. అందుకే ఉగాదిని జరుపుకుంటారట.

Also Read...

చీకటి పడ్డాక ఈ వస్తువులను దానం చేస్తే అరిష్టమే..!

Advertisement

Next Story

Most Viewed