- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వినాయకుడి పూజకు తులసి ఆకులు ఎందుకు వాడరో తెలుసా?
దిశ, వెబ్ డెస్క్ : ఏ శుభకార్యం చేసినా, ఎలాంటి పూజ చేసినా ముందుగా, వినాయకుడికి పూజ చేస్తాము. ఏ పని చేపట్టినా విఘ్నాలు కలగకుండా ఉండాలని ముందుగా వినాయకుడికి పూజ చేస్తాం. అయితే వినాయకుడ పూజలో సింధూరం, గరక, పువ్వులు దర్భలు, ఇలా ఎన్నో వాడుతుంటారు. కానీ ఒక తులసిని మాత్రం వినాయకుడి పూజలో వాడరు.
అయితే చాలా మందిలో డౌట్ ఉంటుంది. అన్ని పూజలకు వాడే తులసి దళాలను, వినాయకుడి పూజకు ఎందుకు వాడరు అని. కాగా, దీని గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం.
తులసీ దేవి వినాయకుడి రూపానికి ఆకర్షితురాలు అవుతుందంట. గణేషుడిని వివాహం చేసుకోవాలనే కోరిక తులసి కలుగుతుందంట. దీని వలన వినాయుడికి తపోభంగం అవుతుంది. అందువలన తులసి నేను బ్రహ్మచారిని, అని తులసి కోరికను తిరస్కరిస్తాడు. దీంతో కోపోద్రోక్తురాలైన తులసి, బ్రహ్మచారిగా ఉండమని శపిస్తాడు. దీంతో వినాయకుడు కూడా తులసిని అసురుడిని భర్తగా పొందుతావని, అతడి చరలో ఉండిపోతావని శపిస్తాడు.దీంతో వినాయకుడి శాపం వల్ల తులసికి చంకచూడుడనే రాక్షసుడితో వివాహం జరుగుతుంది. అతడికి కృష్ణ కవచం ఉందనే గర్వంతో లోక కంటకుడిగా మారి అందరిని బాధిస్తుంటాడు. తులసి పాతివ్రత్య మహత్మ్యం వల్ల అతడిని సంహరించడం విష్ణుమూర్తికి దుర్లభం అవుతుంది. వినాయకుడి సహాయంతో ఆమె పాతివ్రత్యానికి భంగం వాటిల్లేలా చేసి ఆ రాక్షసుడిని సంహరిస్తాడు విష్ణుమూర్తి. ఆ తర్వాత శ్రీహరి అనుగ్రహం వల్ల తులసి, మొక్కగా అవతరిస్తుంది.
ఇక తన పాతివ్రత్య భంగానికి వినాయకుడు కారణమని తెలుసుకుని శిరస్సులేకుండా జీవించమని తులసి శపిస్తుంది. అందుకే వీరిద్దరి మధ్య వైరం ఉంటుంది అందుకే వినాయక చవితి మినహాయించి ఎప్పుడూ తులసికనిపించదంట.
ఇవి కూడా చదవండి: