తల్లి రక్తంతో బిడ్డ జన్మిస్తుంది.. కానీ తల్లి బ్లడ్ గ్రూప్, బిడ్డ బ్లడ్ గ్రూప్ ఎందుకు వేరుగా ఉంటుందో ఆలోచించారా?

by Jakkula Samataha |
తల్లి రక్తంతో బిడ్డ జన్మిస్తుంది.. కానీ తల్లి బ్లడ్ గ్రూప్, బిడ్డ బ్లడ్ గ్రూప్ ఎందుకు వేరుగా ఉంటుందో ఆలోచించారా?
X

దిశ, ఫీచర్స్ : ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది అద్భుతంగా చెప్పవచ్చు. మాతృత్వం కోసం ఎంతో మంది ఆరాటపడుతుంటారు. పిండ దశలో ఉన్నప్పటి నుంచి ఆ బిడ్డ భూమి మీదకు వచ్చే వరకు ప్రతి రోజూ ఆ తల్లికి ఒక కొత్త రోజే. తన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని మంచి ఆహారం తీసుకోవడం, టైమ్‌కి మందులు వేసుకోవడం లాంటివి చేస్తుంది. అంతే కాకుండా తన బిడ్డ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి ప్రతి నెల ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుని, పుట్టబోయే శిశువుపై జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక బిడ్డ పుట్టాక మాత్రం తల్లికి, బిడ్డకు మధ్య చాలా తేడాలు ఉంటాయి. తన తల్లి పోలికలతో పుట్టకపోవడం, కనీసం బ్లడ్ గ్రూప్ కూడా మ్యాచ్ కాకుండా ఉంటాయి. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు తల్లి రక్తపు ముద్దతోనే కదా బిడ్డ తయారు అయ్యేది. మరీ బిడ్డ, తల్లి బ్లడ్ గ్రూప్ ఎందుకు వేరుగా ఉంటుందని, కాగా, ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం.

అయితే గర్భంలో ఉన్నప్పుడు చాలా మంది పిండం రక్తం, తల్లి రక్తం కలుస్తుంది అనుకుంటారు. కానీ, వీరి బ్లడ్ కలవదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. గర్భధారణ సమయంలో తల్లి, పిండం వేర్వేరు రక్త ప్రసరణ వ్యవస్థను కలిగి ఉంటాయి. పిండానికి అవసరమయ్యే ఆక్సిజన్, పోషకాలు తల్లి రక్తప్రవాహం నుండి మాయ ద్వారా పిండానికి వెళతాయి, అంటే రక్త కణాలు విడివిడిగా ఉంటాయి. పదార్ధాల మార్పిడి ప్లాసెంటల్ సర్క్యులేషన్ అనే ప్రక్రియ ద్వారా జరుగుతుంది. ఇక పిల్లల రక్త సమూహం అనేది తల్లిదండ్రులిద్దరి నుంచి సంక్రమించిన జన్యు సమాచారం ద్వారా నిర్ణయించబడుతుంది. పిల్లల రక్త వర్గాన్ని నిర్ణయించడానికి తండ్రి జన్యు సమాచారం తల్లి జన్యు సమాచారంతో కలిపి గర్భధారణ సమయంలో పిల్లల రక్త సమూహం ఏర్పడుతుంది. పిల్లవాడు ప్రతి పేరెంట్ నుండి ఒక బ్లడ్ గ్రూప్ యుగ్మ వికల్పాన్ని వారసత్వంగా పొందుతాడంట. అదే వారి రక్త సమూహాన్ని నిర్ణయిస్తుందంట. అంతే కాకుండా తల్లిదండ్రుల బ్లడ్ గ్రూప్స్ వేరుగా ఉంటే వారికి భిన్నంగా పుట్టే బిడ్డ బ్లడ్ గ్రూప్ ఉంటుంది. ఉదా: తల్లిది A బ్లడ్ గ్రూప్ తండ్రిది B అయితే పుట్టబోయే బిడ్డది AB లేదా Oగా ఉంటుంది అంట.

Advertisement

Next Story

Most Viewed