12 ఉంటేనే డజన్ అని ఎందుకంటారో తెలుసా..

by sudharani |   ( Updated:2023-05-27 07:37:08.0  )
12 ఉంటేనే డజన్ అని ఎందుకంటారో తెలుసా..
X

దిశ, వెబ్‌డెస్క్: అరటి పండ్లు, గుడ్లు ఇలా కొన్ని రకాల వస్తువులను పండ్లను డజన్‌లలో కొలుస్తారు. డజన్ అంటే 12 అని అందరికీ తెలిసిన విషయమే. కానీ, డజన్‌లో 12 మాత్రమే ఎందుకు ఉంటాయి. పదో, పదకొండో ఉండచ్చు కదా..! అని చాలా మందికి డౌట్ రావచ్చు. కానీ, 12 ఉంటేనే డజన్ అని అనేందుకు అనేక కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఇలా డజన్ రూపంలో లెక్కించడానికి డ్యూడెమికల్ సిస్టమ్ అంటారు. పురాతన కాలంలో ప్రజలు వస్తువులను సులభంగా లెక్కించేందుకు వేళ్లను ఉపయోగించేవారు. ఈ క్రమంలో బొటన వేలును మినహా మిగిలిన వేలు మధ్యలో గీతాలను లెక్కించేవారు. అవి మొత్తం 12 గీతలు ఉంటాయి. ఈ విధంగా లెక్కించడం సులభం అవుతుంది కాబట్టి ఈ పద్దతిలో డజన్ అనే పదం వచ్చింది.

* విభజించడానికి సులభమైన సంఖ్య 12. ఉదాహరణకు 12 అనే సంఖ్యను డజన్ అన్నప్పుడు, దానిలో సగం కావాలంటే అరడజన్ అరటి పండ్లు, లేదా అరడజన్ గుడ్లు అని సంబోధిస్తారు. అంటే 6-6 అని, లేదా మూడు గ్రూపులు అయితే 4-4-4 అని, నాలుగు గ్రూపులుగా విభజించాలంటే 3-3-3-3 గా ఈజీగా విభజించవచ్చునని ఇలా 12 అనే సంఖ్యను మాత్రమే డజన్‌గా పిలుస్తారట.

Read More... Black Raisins: వీటిని నానబెట్టి తింటే చాలు.. ఏ వ్యాధులు కూడా రావట?

ఏ కలర్ వాలెట్ వాడితో అదృష్టమో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed