- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఏ ఆత్మలు దెయ్యాలుగా మారుతాయో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : చనిపోయినవారు దెయ్యాలుగా మారుతారు అని చాలా మంది అంటుంటారు. కానీ అలా జరగదంట. కొన్ని ఆత్మలు మాత్రమే ప్రేతాత్మగా మారి బతికి ఉన్నవారిని ఇబ్బంది పెడుతాయంట. అయితే గరుడ పురాణం ప్రకారం ఏ ఆత్మలు ప్రేతాత్మలుగా మారుతాయి అనేది ఇప్పుడు చూద్దాం.మరణానంతరం ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఆకలి, దాహం, కోపం, దుఃఖం, కామం అనే లక్షణాలను కలిగి ఉంటాయని గరుడ పురాణంలో పేర్కొన్నారు. గరుడ పురాణంలో మొత్తం 84 లక్షల జీవుల గురించి ప్రస్తావించారు. ఇందులో జంతువు, పక్షి, చెట్టు, క్రిమి కీటకాలు, మానవుడు వంటి ఆత్మలు ఉన్నాయి.
మరణం తరువాత ఒక వ్యక్తి ఆత్మ ఏ జన్మకు వెళ్తుందో, అది అతని జీవితకాలంలో చేసిన పనులపై మాత్రమే ఆధారపడి ఉంటుందంట. దుర్మార్గుల ఆత్మలు మృత్యులోకంలో సంచరిస్తూనే ఉంటాయి. మరోవైపు.. ప్రమాదం, హత్య లేదా ఆత్మహత్య మొదలైన వాటి కారణంగా ఒక వ్యక్తి మరణిస్తే, అంటే.. ఆత్మ తన శరీరాన్ని సహజ మరణంతో విడిచిపెట్టకపోతే, ఆత్మ ప్రేతాత్మగా మారి తిరుగుతుంది. ఆకస్మాత్తుగా చనిపోయిన వారు ప్రేతాత్మగా మారి, తన ఇంటి చుట్టే తిరుగుతుందంట. అందువలన వారికి పిండప్రధానాలు నియమాలను అనుసరించి చేయాలి అంటుంటారు.