- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
vegetables : కూరగాయల పై రసాయనాలు.. ఏ అవయవాలు దెబ్బతింటాయో తెలుసా ?
దిశ, ఫీచర్స్ : ఒకప్పటి కాలంలో పంటలను సేంద్రీయ ఎరువులతో నాచురల్ పద్దతుల్లో పండించేవారు. కాలం మారుతున్నా కొద్ది పొలాల్లో పంట పండించినప్పటి నుంచి మీ ప్లేట్‌లోకి చేరే వరకు అనేక రకాల రసాయనాలను కలుపుతారు. ఈ రసాయనాల ద్వారా పండించిన ఆహారం కారణంగా అనారోగ్యం బారిన పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఇకపోతే మొలకలు, ఉల్లిపాయలు, క్యాబేజీ, బ్రోకలీ వంటి కూరగాయల పంటలలో ఉపయోగించే రసాయణాల ద్వారా తల్లికడుపులో ఉన్న పిల్లల ఆరోగ్యం కూడా పాడవుతుందని అమెరికాకు చెందిన ఈపీఏ పేర్కొంటుంది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1000 కంటే ఎక్కువ పురుగుమందులు ఉపయోగిస్తున్నారు. ప్రతి పురుగుమందు శరీరం పై వివిధ రకాల ప్రభావాలను చూపిస్తుంది.
కూరగాయల ఉత్పత్తి సమయంలో కొంతమంది చాలా ఎక్కువ క్రిమిసంహారక మందులు వాడుతుంటారు. అటువంటి కూరగాయలు ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. అలాగే కూరగాయలు మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత కూడా దానికి అనేక రకాల రసాయనాలు కలుపుతున్నారు. దీంతో ఆ కూరగాయలు మెరుస్తూ ఉంటాయి. ఉదాహరణకు రెడ్ క్యాప్సికమ్, ఛాంపిగ్నాన్స్, వంకాయలు వంటి వాటిపైన కృత్రిమ రంగులు వేసి మెరిసేలా చేస్తుంటారు. ఈ రంగులు రసాయనాలను కలిగి ఉంటాయి. వీటి ద్వారా అనేక వ్యాధులు సంక్రమిస్తుంటాయి.
ఈ రంగుల్లో రోడమైన్-బి రసాయనం ఉంటుంది. ఈ రసాయనం కూరగాయలకు ఎరుపు రంగు, ముదురు ఆకుపచ్చ రంగును ఇస్తుంది. పచ్చి కాయగూరలు మెరిసిపోవడానికి ఆరామిన్ రసాయనాన్ని కలుపుతారు. ఈ రసాయనాలు కూరగాయలను తాజాగా కనిపించేలా చేస్తాయి. రోడమైన్-బి, ఔరమైన్ రెండూ ప్రమాదకరమైనవి. ఇవి క్యాన్సర్‌ని కూడా కలిగిస్తాయి అలాగే అనేక అవయవాలను దెబ్బతీస్తాయి.
పురుగుమందుల వల్ల ఏ అవయవాలు దెబ్బతింటాయి ?
రసాయనాలు మానవుల శరీరంలోని అనేక భాగాలకు హాని కలిగిస్తాయి. ఏదైనా పురుగుమందులో ఆర్గానోఫాస్ఫేట్, కార్బమేట్ ఉంటే, అది చర్మం, కళ్ళు, గుండెకు హాని కలిగిస్తుంది. పురుగుమందులు ఆర్గానోఫాస్ఫేట్, కార్బమేట్ నరాలను కూడా దెబ్బతీస్తాయి.
ఇవి శ్వాస తీసుకోవడంలో కూడా సమస్యలను కలిగిస్తాయి. అధిక మొత్తంలో పురుగు మందులు శరీరంలోని అనేక భాగాలను ఏకకాలంలో ప్రభావితం చేస్తాయి. అధిక మోతాదులో పురుగుల మందులు చల్లిన కూరగాయలను తినడం ద్వారా ఆరోగ్యం పై దాని ప్రభావాలు కనిపిస్తాయి. క్యాన్సర్ కేసులు వేగంగా పెరగడానికి కూరగాయలు, పండ్ల మీద ఉండే రసాయనాలే కారణం అంటున్నారు నిపుణులు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.