భూమి తిరగడం ఒక సెకెన్ ఆపితే ఏం జరుగుతుందో తెలుసా?

by Jakkula Samataha |   ( Updated:2024-02-01 05:25:11.0  )
భూమి తిరగడం ఒక సెకెన్ ఆపితే ఏం జరుగుతుందో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియా వచ్చాక వింతలు, విశేషాలకు కొదవే లేకుండా పోయింది. ఇంటర్నెట్ ద్వారా చాలా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం.ఇక మనం చిన్నప్పుడు భూమి గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం.

సౌర కుటుంబం, గ్రహాల గురించి పాఠశాల స్టేజ్ నుంచే తెలుసుకుంటాం. ముఖ్యంగా భూమి తన చుట్టూ తాను చాలా వేగంగా తిరుగుతుంది అంటారు. దాదాపు భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది. అంతే కాకుండా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ కూడా నిర్ణీత దిశలో తిరుగుతుందని, దీని కారణంగానే పగలు, రాత్రి రుతువులు అనేవి ఏర్పడుతాయానే విషయం తెలిసిందే.

మరి ఒక వేళ భూమి తనచుట్టూ తాను తిరగడం ఆపేస్తే, ఏదైనా కారణంగా భూమి ఒకసెకన్ తిరగడం ఆగిపోతే, ఏం జరుగుతుంది అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? అయితే ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.

భూమి తిరగడం ఒక సెకెన్ ఆగిపోతే భూకంపాలు, సునామీలు వస్తాయంట.అంతే కాకుండా మనుషులు కూడా గాల్లో ఎగిరిపోతారు. సముద్రాల్లో నీరు కూడా గాలిలా ఎగిరిపోతుంటాయంట.అందువలన భూమి అకస్మాత్తుగా తిరగడం ఆగిపోతే అందరికీ హానికరం అంటున్నారు ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రవేత్త నీల్ డి గ్రాస్సే టైసన్. ఈ ఘటన ప్రజలను చుట్టూ విసిరేస్తుందని, అది భయంకరమైన రోజు అవుతుందని అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story