చనిపోయిన వారి ఆధార్ కార్డ్ ఏమౌతుందో తెలుసా ?

by samatah |   ( Updated:2023-03-24 13:32:49.0  )
చనిపోయిన వారి ఆధార్ కార్డ్ ఏమౌతుందో తెలుసా ?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆధార్ కార్డు అనేతి ప్రతి ఒక్కరికీ తప్పనిసరి. ఇక మనం బతికే ఉన్నాం అని చెప్పడానికి ఇది ఫ్రూప్ లాంటిది. అయితే కొంతమంది చనిపోయిన తర్వాత కూడా వారి ఆధార్ కార్డు అలానే ఉంటుంది. దీంతో కొందరు ఆధార్ కార్డ్ ఏం చేయాలో తెలియ దాన్ని అలానే దాచి పెడుగుంటారు. అయితే రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఓ వ్యక్తి మరణించిన తరువాత అతని ఆధార్ కార్డును డియాక్టివేట్ చేసే విధానాన్ని తీసుకొస్తున్నారు.

ఏ వ్యక్తి చనిపోయినా సరే జనన, మరణ రికార్డుల్లో నమో చేస్తారు. మరణాన్ని నమోదు చేసేటప్పుడు వ్యక్తి ఆధార్ నెంబర్ తప్పనిసరి. మరణ దృవీకరణ పత్రాన్ని జారీ చేస్తున్నప్పుడు వ్యక్తి కుటుంబ సభ్యుల అనుమతితో ఆధార్ కార్డు డియాక్టివేట్ చేయబడుతుంది. ఇలా చనిపోయిన వారి ఆధార్ కార్డును డియాక్టివేట్ చేసే ప్రక్రియ ఇప్పుడు అమలులోకి రానుంది.

Also Read..

Super spreaders: డెంగ్యూ వ్యాప్తికి కారణమవుతున్న ‘సూపర్ స్ప్రెడర్స్‘.. తాజా అధ్యయనం

Advertisement

Next Story

Most Viewed