- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Eggs: ప్రతి రోజూ గుడు తీసుకుంటే ఏమౌతుందో తెలుసా ?
దిశ,వెబ్ డెస్క్ : చౌక ధరలో అందుబాటులో ఉండే పోషకాహారం కోడి గుడ్డు. గుడ్డు ఆరోగ్యాన్ని పెంచడమే కాదు. మీకు ఒక సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. గుడ్డును ఆహారంలో తీసుకోవడం వల్ల అనేక జబ్బులు నుండి రక్షించుకోవచ్చు. ఇందులో విటిమిన్ ఎ,విటిమిన్ ఇ, విటిమిన్ డి మరియు విటిమిన్ కె, విటమిన్ బి6, విటిమిన్ 12 తో పాటు క్యాల్షియం, ఐరన్ , జింక్ , థయామిన్ , పోలిక్ యాసిడ్, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం ఇంకా అనేక పోషకాలు ఇందులో ఉన్నాయి. ఏవి ఏమిటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..
చర్మ కాంతి పెంచుతుంది
గుడ్డులో ఉండే విటమిన్ ఇ మీ చర్మ కాంతిని పెంచేందుకు దోహదపడుతుంది. ప్రతి రోజూ గుడ్డును తీసుకుంటే అందులోని ప్రోటీన్లు మీ చర్మ కణాలను శుద్ధి చేసి, మెరుపును తీసుకువస్తాయి. గుడ్డును పేస్ ఫ్యాక్‌గా ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
కంటి సమస్యలు దూరం చేస్తుంది
గుడ్డులో కెరోటినాయిడ్లు , ల్యూటిన్ అనే పోషకాలు ఉంటాయి. ఇవి కంటికి సంబంధించిన వ్యాధులను దూరం చేస్తాయి. గుడ్డులో శరీరానికి అవసరమైన అమినో ఆమ్లాలు ఉంటాయి.
జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది
ప్రతి రోజూ గుడ్డును ఆహారంలో తీసుకోవడంలో వల్ల మీ జుట్టు పెరుగుదలను పెంచుకోవచ్చు. ఇందులో ఉండే పోషకాలు జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. గుడ్డును తలకు అప్లై చేయడం ద్వారా అందమైన కురులను సొంతం చేసుకోవచ్చు.
Read more:
- Tags
- Eggs
- Healthtips