- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాత్రిళ్లు జుట్టు విరబోసుకుని శృంగారం చేస్తున్నారా..? అయితే ఈ సమస్యలు తలెత్తినట్టే..!
దిశ, వెబ్‌డెస్క్ : ఈ మధ్యకాలంలో చాలా మంది మహిళలు ఫ్యాషన్‌గా, పార్శ్‌గా కనిపించేందుకు ఇష్టపడుతున్నారు. అందులో భాగంగానే జుట్టును ముడికట్టుకోకుండా విరబోసుకుని బయటికి వెళతారు. ప్రత్యేకమైన దుస్తులు ధరించి వెవీ హెయిర్, కర్లీ హెయిర్ అంటూ జుట్టును లూస్‌గా వదలడం ట్రెండ్ అయిపోయింది. అటు కాలేజీ అమ్మాయిల నుంచి మొదలుకుని గృహిణులు కూడా లూస్ హెయిర్‌తో ఉండడానికే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా జుట్టు విరబోసుకుంటున్నారు. అయితే ఇలా చేయడం వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతాయని, ప్రతికూల ప్రభావం పడుతుందని వేదాలు చెబుతున్నాయి. మరి ఆ ప్రతికూల ప్రభావాలు ఏంటి, ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో తెలుసుకుందాం..
హిందూ సంప్రదాయం ప్రకారం మహిళలు పగలు, రాత్రి ఎప్పుడైనా జుట్టు విరబోసుకుని ఉండకూడదట. ముఖ్యంగా రాత్రి సమయంలో జుట్టు విరబోసుకుంటే సమస్యలు ఎదురవుతాయని అంటారు. అలాగే దుష్ట శక్తుల ప్రభావం కూడా ఎక్కువగా పడుతుందట. వెంట్రుకలు వదులుగా ఉన్నప్పుడు అవి ఒకదానికొకటి రాపిడి జరిగి రాజ-త ఆధిపత్య శక్తి ప్రవాహాన్ని సృష్టిస్తుందట. అయితే రాత్రిళ్లు సంచరించే చెడు శక్తులు, ప్రతికూల శక్తులను రాజ-త ఆధిపత్య శక్తి ప్రవాహం ఎక్కువగా ఆకర్షిస్తుందని చెబుతారు. దీని కారణంగా జుట్టు విరబోసుకున్న వారి శరీరంలోకి ప్రతికూల శక్తులు ప్రవేశించి సమస్యలు ఒకదాని తరువాత ఒకటి వస్తాయట.
అలాగే రాత్రి పూట జుట్టును వదులుగా ఉంచితే శని ప్రభావం ఎక్కువగా ఉంటుందట. దీంతో జీవితంలో సమస్యలు వస్తాయని, అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాక ఇబ్బందులు ఎదురవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అదేవిధంగా కుటుంబంలో సమస్యలు కూడా తలెత్తుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. రాత్రిళ్లు వదులు జట్టుతో నిద్రిస్తే దంపతుల మధ్య గొడవలు మొదలవుతాయని, సాన్నిహిత్యం దెబ్బతింటుందని శాస్త్రం హెచ్చరిస్తుంది. దాంతో ఆ కుటుంబంలో ప్రశాంతత దూరం అవుతుందట.
ఇక శాస్త్రీయంగా చెప్పాలంటే రాత్రి పడుకునేటప్పుడు జుట్టును వదులుగా ఉంచితే జుట్టుకు దిండుకు మధ్య ఘర్షణ ఏర్పడి జుట్టు రాలుతుందని చెబుతున్నారు వైద్యులు. అలాగే హెయిర్ బ్రేకేజ్ కావడం, చివర్లు చీలిపోవడం, జుట్టు పొడిగా మారి చిట్లిపోవడం, జుట్టు చిక్కులు పడటం, జుట్టు రాలడం ఇలా ఎన్న సమస్యలు ఎదురవుతాయట. మరి అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే జడ వేసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.