హొలీ దహనంలో ఆవు పిడకలను కాల్చడం వెనుక శాస్త్రీయ కోణం ఏంటో తెలుసా?

by Jakkula Samataha |
హొలీ దహనంలో ఆవు పిడకలను కాల్చడం వెనుక శాస్త్రీయ కోణం ఏంటో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : హోలీ పండుగ వచ్చేస్తుంది. రంగు రంగులతో బాధలన్నీ మర్చిపోయి , చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా సంతోషంగా ఆడుకుంటారు. ఇక ఈ హోలీ పండుగ రోజు హోలికా దహనం చేస్తారు. ముఖ్యంగా ఆవు పేడతో పిడకలు చేసి, వాటిని కాల్చుతూ..పాటలు పాడుతూ..హోలీ ఆడతారు.

అయితే అసలు హోలీ దహనంలో పిడకలనే ఎందుకు కాల్చుతారు. దీని వెనుక గల అసలు కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ సంప్రదాయం ప్రకారం, గోవును దేవుని తో పోలుస్తారు. అందుకే గోవును చాలా పవిత్రంగా పూజిస్తారు. ఇక హోలీ రోజు ఆవు పిడకలను కాల్చడం వల్ల వెలువడే పొగ ప్రతికూల శక్తులను దూరం చేస్తుందని నమ్మకం. అంతే కాకుండా హోలీ కా దహనంలో ఆవు పేడతో చేసిన వాటిని కాల్చడం వెనుక శాస్త్రీయ కోణం కూడా ఉంది.శీతాకాలం ముగిసి వేసవి కాలం ప్రారంభమయ్యే సమయంలో హోలీ పండుగను జరుపుకుంటారు. అయితే ఈ సమయంలో చెడు బ్యాక్టీరియా తొలిగించి పర్యావరణాన్ని శుద్ధి చేయడానికి ఆవుపేడను కాల్చుతారంట. ఎందుకంటే చెడు బ్యాక్టీరియా ని శుద్ధి చేసే మూలకాలు ఆవు పేడలో అధికంగా ఉంటాయి.

Advertisement

Next Story