చంద్రగ్రహణం సమయంలో గర్భిణీలు పాటించాల్సిన నియమాలేంటో తెలుసా..

by Sumithra |   ( Updated:2024-09-17 09:38:37.0  )
చంద్రగ్రహణం సమయంలో గర్భిణీలు పాటించాల్సిన నియమాలేంటో తెలుసా..
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ ఏడాదిలో సెప్టెంబర్ 18 వ తేదీన రెండో చంద్రగ్రహణం ఏర్పడనుంది. భాద్రపద మాసం పౌర్ణమి రోజున ఈ గ్రహణం సంభవిస్తుంది. సూర్యుడు, చంద్రుని మధ్య భూమి వచ్చినప్పుడు దాని నీడ చంద్రుని పై పడుతుంది. ఈ కాలంలో పాక్షిక, సంపూర్ణ లేదా పెనుంబ్రల్ గ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ గ్రహణం సమయంలో గర్భిణీలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు పండితులు.

చంద్రగ్రహణం తేదీ ఎప్పుడు..

భారత కాలమానం ప్రకారం సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ 18 ఉదయం 6:12 గంటలకు ప్రారంభమై రాత్రి 10.17 గంటలకు ముగుస్తుంది. ఉదయం 7.42 గంటలకు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఉదయం 8:14 గంటలకు చంద్రగ్రహణం ఉచ్ఛస్థితిలో ఉంటుంది. కాగా ఈ గ్రహణం 4 గంటల 5 నిమిషాల పాటు కొనసాగనుంది. ఈసారి గ్రహణం సూతకం ప్రభావం కనిపించదు. ఎందుకంటే ఈసారి చంద్రగ్రహణం సమయం భారతదేశంలో పగటిపూట ఉంటుంది. అందువల్ల ఈ గ్రహణం భారతదేశ ప్రజలకు కనిపించదు.

గర్భిణీ స్త్రీలు ఎందుకు బయటకు వెళ్లకూడదు ?

చంద్రగ్రహణం సమయంలో సూతకం వస్తుంది. సూతక కాలం అశుభమైనదిగా పరిగణిస్తారు. ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. అంతే కాదు గర్భిణీలు కూడా ఇంటి నుంచి బయటకు రాకూడని సమయం ఇది. ఈ కాలంలో మహిళలు తమ గర్భంలో ఉన్న శిశువు గురించి శ్రద్ధ వహించాలి. గర్భిణీలు గ్రహణాన్ని కంటితో ప్రత్యక్షంగా వీక్షించకూడదని చెబుతున్నారు పండితులు. అందుకే వారు ఇంట్లోనే ఉండాలని చెబుతుంటారు. అలాగే పదునైన వస్తువులను గ్రహణం సమయంలో అస్సలు వాడకూకడదు అని చెబుతారు. గ్రహణ కాలంలో పండ్లు, కూరగాయాలు అస్సలు కట్ చేయొద్దంటున్నారు. అలాగే గ్రహణ కాలంలో గర్భిణీలు లోహ వస్తువులకు చాలా దూరంగా ఉండాలని చెబుతుంటారు.

ఇక 2025లో అరుదైన పౌర్ణమి కూడా కనిపించబోతోంది. బ్లడ్ మూన్ 13 - 14 మార్చి 2025లో కనిపిస్తుంది. ఇది అమెరికా, ఆఫ్రికా, ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో కనిపించే అరుదైన పౌర్ణమి. దీని వ్యవధి సుమారు 1 గంట ఉంటుంది.


Read More..

ఈ ఐదు జీరో క్యాలరీ డ్రింక్స్‌తో బరువు సమస్యకు చెక్ పెట్టండి..!

Advertisement

Next Story