మేక పాలు తాగడం వలన మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-07-31 06:16:36.0  )
మేక పాలు తాగడం వలన మన ఆరోగ్యానికి కలిగే  ప్రయోజనాలేంటో  తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: వర్షాకాలం రాగానే అనేక వ్యాధులు వస్తుంటాయి. ఈ సీజన్లో దోమల వల్ల వచ్చే వ్యాధులు రావడం సర్వసాధారణం. వాటిలో డెంగ్యూ వ్యాధి వర్షాకాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. డెంగ్యూ ఎక్కువగా దోమల వల్ల వస్తుంది. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారుతుంది. డెంగ్యూ వచ్చినప్పుడు మేక పాలు తాగమని వైద్యులు, రోగికి సలహా ఇస్తుంటారు. అయితే డెంగ్యూ మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలలో అదుపు చేయడంలో ఇది ప్రభావవంతంగా పని చేస్తుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

వాపు

మేక పాలు తాగడం రోజూ తీసుకోవడం వల్ల కడుపులో మంట తగ్గుతుంది. వాస్తవానికి మేక పాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే మంటను తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా గ్యాస్ సమస్యలను కూడా తగ్గిస్తుంది.

మానసిక ఆరోగ్యం

ఆందోళన, డిప్రెషన్, మానసిక సమస్యలతో బాధ పడుతున్న వారు మేక పాలు మీకు చాలా మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వలన శరీరంలో సంతోషకరమైన హార్మోన్లు విడుదలవుతాయి. ఇది మీ మానసిక స్థితిని మెరుగు పడేలా చేస్తుంది.

కీళ్ల నొప్పులు

వయస్సు పై బడిన వారికి కీళ్ల నొప్పులు రావడం సహజం. దీన్ని తాగడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. దీనిలో ఉండే కాల్షియం కీళ్లు, ఎముకలను బలపరుస్తుంది. ఇది నొప్పిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

Also Read: పిల్లలు మరీ ఎక్కువగా టీవీ చూస్తున్నారా?.. పెద్దయ్యాక జరిగేది తెలిస్తే షాక్ అవుతారు !

Advertisement

Next Story