బొడ్డులో నూనె వేయడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-07-24 14:43:56.0  )
బొడ్డులో నూనె వేయడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: బొడ్డులో నూనె వేయడం వలన మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకుందాం..

1. ఈ రోజుల్లో స్త్రీలు పీరియడ్స్ సమయంలో నొప్పితో బాధ పడుతుంటారు. రుతుక్రమ సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే కొబ్బరి నూనెను బొడ్డులో వేసి మర్దన చేసుకోవడం వలన కడుపు దగ్గర ఉండే కండరాలకు ఉపశమనం కలిగి తిమ్మిర్ల సమస్య తగ్గిపోతుంది.

2.బొడ్డులో నూనె వేయడం వలన పురుషులు శరీరంలో పెరుగుదల, రక్షణ ఉంటుంది. లైంగిక సామర్ధ్యం పెరుగుతుంది.

3. పొట్టపై కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకోవడం వలన కంటిచూపు మెరుగుపడుతుంది. జలుబు వంటి సమస్యను కూడా సులభంగా తగ్గించే గుణం దీనికి ఉంది.

4. ఆవ నూనెను నాభి పై రాస్తే మొటిమలు, మచ్చలు తగ్గుముఖం పడతాయి.

5.రోజు బొడ్డులో నూనె రాయడం వలన పగిలిన పెదవులు మృదువుగా, గులాబీ రంగులోకి మారుతాయి. కళ్ళ మంట, దురద, పొడి బారడం వంటి వాటిని కూడా నయం చేస్తుంది.

6.ఆవ నూనెను నాభి పై పూయడం వలన మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Advertisement

Next Story