సమ్మర్ స్టార్ట్ .. ప్రతి రోజూ గ్లాస్ లస్సీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

by Jakkula Samataha |
సమ్మర్ స్టార్ట్ .. ప్రతి రోజూ గ్లాస్ లస్సీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : సమ్మర్ మొదలైంది. దీంతో చాలా మంది కూల్ వాటర్ తాగడానికి ఏవైనా జ్యూస్ తాగడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక ఎండ వేడిని తట్టుకొని ఆరోగ్యంగా ఉండాలంటే లస్సీ తాగాలి అంటున్నారు వైద్యులు.ఎందుకంటే లస్సీలో విటమిన్స్, కాల్షియం, పొటాషియం, సల్ఫర్, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. అందువలన ఆరోగ్య నిపుణులు వేసవికాలంలో ప్రతీ రోజు లస్సీ తాగాలని చెబుతుంటారు.కాగా, రోజూ లస్సీ తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • ప్రస్తుతం చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారికి లస్సీ దివ్యఔషధం. పెరుగుతో చేసిన ఈ లస్సీని రోజులో ఒకసారి తీసుకోవడం వలన మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చునంట.
  • పెరుగు లాగా లస్సీలో కూడా ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది కడుపులో చెడు బ్యాక్టీరియా వృద్ధిని నిరోధిస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
  • వేడితో బాధపడుతున్నవారు వేసవిలో లస్సీ తాగడం చాలా మంచిదంట. ఇందులో ఎక్కువ ఎలక్ట్రోలైట్ కంటెంట్ ఉంటుంది. అందువలన ఇది శరీరం డీ హైడ్రేట్ కాకుండా కాపాడుతుందంట.
  • లస్సీలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అందువలన దీన్ని రోనూ తీసుకోవడం వలన ఎముకలు దృఢంగా ఉండి ఆరోగ్యంగా ఉంటాయి. క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇందులోని పొటాషియం, రైబోఫ్లావిన్ వంటి పోషకాలు శరీరంలోని మలినాలను తొలగించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే ఎసిడిటీ, అధిక బరువు, జీర్ణసమస్యలతో బాధపడే వారు కూడా రోజూ లస్సీ తాగడం చాలా మంచిదంట.
Advertisement

Next Story