- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సినిమా హాల్లో తెరపై ఎంత వెండి ఉంటుందో తెలుసా..?
దిశ, వెబ్‌డెస్క్ : మూవీ అనే ఆంగ్లపదానకి సరైన అనువాదం తెలుగులో చలనచిత్రం. చలనచిత్రం అనే పదం సంస్కృత నుండి వచ్చింది. దాని అర్థం ‘కదిలేబొమ్మ’. కానీ సినిమా అనేదే బాగా జనబాహుళ్యంలో వాడుతున్నారు. ఇంకా వెండితెర అనే పదాన్ని కూడా సినిమాను సూచిస్తూ వాడుతారు. నేతి బీరకాయల్లో నెయ్యి ఎంత ఉందో మన సినిమా హాల్‌లోని వెండితెరపై వెండి అంతే ఉంది. ఇంతకు సినిమా తెరను ఎందుకు వెండి తెర అంటారు..? దానిని వెండితోనే తయారు చేస్తారా..? ఇలాంటి ఆసక్తికర విషయాలను తెలుసుకుందా.
పూర్వం చిలుము పట్టకుండా ఉండే తెల్లటి గట్టి పదార్థం, దృఢంగా సన్నగా ఉండే పదార్థం వెండి కాబట్టి ఆ రోజుల్లో వెండిపూత ఉండే స్టీలు తెర ఉండేది. అందువలే దానికి వెండి తెర అని పేరు వచ్చింది. ప్రస్తుతం పాలీ కార్బొనేట్లు, నైలానులు, పాలీస్టెరీన్లు లాంటి దృఢమైన రెక్సిన్ మీద తెల్లని పెయింట్ పూసి సినిమా తెరగా వాడుతున్నారు. ఇప్పుడవి చాలా చౌక కూడా. లోహానిదైనా, ప్లాస్టిక్కుదైనా, ఆఖరికి వెండిదైనా సినిమా తెరకు దోమ తెర మాదిరిగా రంధ్రాలు ఉంటాయి. వీటి ద్వారానే తెరవెనుక ఉండే స్పీకర్ల ద్వారా శబ్దాలు మనకు వ్యాపిస్తాయి. మొత్తం మీద వెండిపూత పోయినా వెండితెర అనే పద ప్రయోగం మాత్రం ఈనాటికి కూడా నిలిచి ఉంది.
మొదట మూగగా ప్రారంభమైన సినిమాలకు తరువాత ధ్వని తోడయ్యింది. ఆపై రంగులు అద్దారు. అలా సినిమా చాలా కాలం నుండి వర్ధిల్లుతూ వస్తుంది. అయితే అన్ని రంగాల్లోలాగానే సినిమారంగంలో కూడా ఇటీవల చాలా సాంకేతికమైన మార్పులు సంభవించాయి. ముఖ్యంగా కంప్యూటర్లు, డిజిటల్ టెక్నిక్కులు, యానిమేషన్ వంటి సాంకేతిక ఆవిష్కరణలు సినిమా నిర్మాణాన్ని, ప్రదర్శనలను అనూహ్యంగా ప్రభావితం చేశాయి.
ఇవి కూడా చదవండి: