- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వానలు ఎన్ని రకాలో తెలుసా..
దిశ, వెబ్‌డెస్క్ : వర్షాకాలం వచ్చిందంటే చాలు కొన్ని సార్లు వర్షాకాలం మొదలు కాగానే జోరువానలు కురుస్తాయి. మరికొన్ని సార్లు వర్షాకాలం మొదలై రోజులు గడుస్తున్నా అస్సలు వానలే కురవవు. అయితే ఈ వానల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 రకాల వర్షాలు ఉంటాయని పెద్దలు చెబుతుంటారు. ఏంటి అన్ని రకాల వర్షాలు ఉంటాయా అనుకుంటున్నారు కదా. మరి ఆ వర్షాల పేర్లోంటో ఇప్పుడు చూద్దాం..
వానలు రకాలు..
1. మీసర వాన - ఈ వర్షం మృగశిర కార్తెలో కురుస్తుంది.
2. దుబ్బురు వాన - తుప్పర/ తుంపరగా కురిసే వర్షాన్ని దుబ్బురు వాన అంటారు.
3. బట్టదడుపు వాన - ఒంటి మీదున్న బట్టలు తడిపేంతగా వర్షం కురిస్తే దాన్ని బట్టదడుపు వాన అంటారు.
4. సూరునీల్ల వాన - ఇంటి చూరు నుండి ధార పడేలా వాన కురిస్తే దాన్ని సూరునీల్ల వాన అంటారు.
5. గాంధారి వాన - కంటికి ఎదురుగా చెట్లు, వస్తువులు కనిపించనంతగా వర్షం కురిస్తే దాన్ని గాంధారి వాన అంటారు.
6. మాపుసారి వాన - సాయంకాలం వేలల్లో కురిసే వానను మాపుసారి వాన అంటారు.
7. సానిపి వాన - వాకిలి పై అలుకు (కళ్లాపి) జల్లిన విధంగా వానలు కురిస్తే దాన్ని సానిపి వాన అంటారు.
8. తెప్పె వాన - ఒక ప్రదేశంలో ఒక చిన్న మేఘం నుంచి పడే వర్షాన్ని తెప్పెవాన అంటారు.
9. సాలు వాన - రైతులు వ్యవసాయం మొదలు పెట్టేందుకు వీలుగా ఒక నాగలిసాలుకు సరిపడా వాన పడితే అంది సాలువాన.
10. ఇరువాలు వాన - వ్యవసాయంలో రెండు సాల్లకు సరిపడా & విత్తనాలు వేసేందుకు సరిపడా వాన వస్తే అది ఇరువాలు వాన అంటారు.
11. మడికట్టు వాన - బురద పొలాన్ని దున్నేటంత జోరుగా వాన వస్తే దాన్ని మడికట్టు వాన అంటారు.
12. ముంతపోత వాన - ముంత తోటి పోసినంత వాన వస్తే దాన్ని ముంతపోత వాన అంటారు.
13. కుండపోత వాన - కుండతో కుమ్మరించినంత, ఎకధాటిగా వర్షాలు పడితే దాన్ని కుండపోత వాన అంటారు.
14. ముసురు వాన - వరుసగా మూడు, నాలుగు రోజులు విడువకుండా వనాలు కురిస్తే దాన్ని ముసురు వాన అంటారు
15. దరోదరి వాన - ఎడతెగకుండా కురిసే వానని దరోదని వాన అంటారు.
16. బొయ్యబొయ్యగొట్టే వాన - గాలిదుమారంతో కురిసే వానని బొయ్యబొయ్యగొట్టే వాన అంటారు.
17. రాళ్ల వాన - అకాలంగా రాళ్లతో కురిసే వానని వడగండ్ల వాన అంటారు.
18. కప్పదాటు వాన - అన్ని ప్రాంతాల్లో కాకుండా అక్కడక్కడా కొంచెం కొంచెంగా కురిసే వానని కప్పదాటుడు వాన అంటారు.
19. తప్పడతప్పడ వాన - ఒక్కసారిగా పెద్ద పెద్ద చినుకులతో కాసేపు టపటపా కురిసే వానను తప్పడతప్పడ వాన అంటారు.
20. దొంగ వాన - రాత్రంతా కురిసి తెల్లారే సరికి తగ్గిపోయే వానని దొంగవాన అంటారు.
21. కోపులునిండే వాన - రోడ్డు పక్కన గుంతలు నిండేలా కురిస్తే కోపులునిండేవాన అంటారు.
22. ఏక్దార వాన - ఏకధారగా కురిసే వానను ఏక్ధార వాన అంటారు.
23. మొదటి వాన - రైతులు విత్తనాలు నాటిన తరువాత విత్తనాలకు బలమిచ్చే వానను మొదటివాన అంటారు.
24. సాలేటి వాన - భూమి తడిసేంతగా భారీగా వానలు పడితే సాలేటి వాన అంటారు.
25. సాలుపెట్టు వాన - దున్నేందుకు సరిపోయేంత వాన కురిస్తే సాలుపెట్టు వాన అంటారు.
Read More: అన్నం తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకూడదు?