ఈ జుట్టు రకం వారు.. వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలో తెలుసా?

by Anjali |   ( Updated:2023-04-17 04:32:03.0  )
ఈ జుట్టు రకం వారు.. వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా అమ్మాయిలు జుట్టు చాలా పొడవుగా ఉండాలని కోరుకుంటారు. లాంగ్ హెయిర్ కోసం కొంతమంది ఎన్నో రకాల షాంపులు వాడతారు. మరికొందరు పలు రకాల చిట్కాలు పాటిస్తుంటారు. కానీ నిపుణులు ఇది సరియైన పద్ధతి కాదని చెబుతున్నారు. ఏ జుట్టు రకం వారు వారంలో ఎన్ని సార్లు తలస్నానం చేయాలో నిపుణులు చెప్పిన సూచనలు తెలుసుకుందాం..

* జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ షాంపు పెట్టడం మంచిది కాదు. ఎందుకంటే షాంపూలో ఉండే కెమికల్స్ జుట్టును దెబ్బతీస్తాయి. అది కాకుండా హెయిర్ ఫాల్‌కు దారితీస్తుంది.

* సన్నని హెయిర్ ఉన్నవారు తరచుగా తలస్నానం చేస్తారు. ఎందుకంటే వాళ్లకు రెండో రోజే జిడ్డుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు నెత్తి పొడిబారకుండా, జిడ్డుగా మారకుండా ఉండటానికి వారంలో 3సార్లు వాల్యూమ్ షాంపూతో కడగాలి.

* జిడ్డు నెత్తిలోని దుమ్మును, ధూళిని వదిలించుకోవడం చాలా కష్టం. ఇందుకు తరచుగా క్లీన్ చేస్తారు. దీని వల్ల మీ జుట్టు దాని సహజ నూనెలను కోల్పోవడం జరుగుతుంది. అలాగని హెయిర్‌ను కడగకపోతే నూనె ఉత్పత్తి మరింత పెరుగుతుంది. అందువల్ల జిడ్డు నెత్తి ఉన్నవారు ఇతర రోజుల్లో సల్ఫేట్ లేని షాంపూతో కడగండి.

* చుండ్రు ఎన్నో జుట్టు సమస్యలకు దారితీస్తుంది. ఇది నెత్తిమీద దురద, ఇన్ఫెక్షన్లను తెచ్చి పెడుతుంది. ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే మీ జుట్టును రోజు కడగాలి. కానీ షాంపు ఎక్కువగా పెట్టకూడదు.

* కర్లీ హెయిర్ ఉన్నవారు రోజూ శుభ్రం చేయాల్సిన అవసరం లేదు. మీ నెత్తి పొడిగా ఉంటే వారానికి ఒకసారి షాంపు పెట్టండి. దీంతో మీ జుట్టు ఆరోగ్యంగా అందంగా మెరిసిపోతుంది.


ఇవి కూడా చదవండి:

పుచ్చకాయను కొంటున్నారా.. అది కాయా పండా..? ఎలా తెలుసుకోవాలి..?

Advertisement

Next Story