మార్నింగ్ వాక్‌తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

by samatah |   ( Updated:2023-07-02 08:52:25.0  )
మార్నింగ్ వాక్‌తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : నడక ఒక గొప్ప వ్యాయామం. చాలా మంది ఆరోగ్య నిపుణులు ప్రతిరోజూ 5 వేల అడుగులు నడవాలని సూచిస్తూ ఉంటారు. ఆరోగ్యంపై అవగాహన ఉన్నవారు మార్నింగ్ లేవగానే వాకింగ్ కు వెళతారు. ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా చాలా మంది మార్నింగ్ వాక్ చేయడం, జిమ్ కు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. కానీ ఉదయాన్నే వాకింగ్ చేయడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

క్రమం తప్పకుండా మార్నింగ్ వాక్ చేయడం వలన గుండెపోటు లాంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చునంట. మార్నింగ్ వాక్ రక్తంలో నిల్వ ఉన్న కొవ్వును తగ్గిస్తుంది. దీంతో రక్త నాళాల్లో కొవ్వు కరిగి రక్త సరఫరాకు ఎలాంటి ఆటకం ఉండదంట.అంతేకాకుండా ఊబకాయంతో బాధపడే వారికి కూడా మార్నింగ్ వాక్ ఎంతో ఉపయోగ పడుతుంది. రోజూ ఉదయం క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వలన బరువు తగ్గవచ్చునంట.అలాగే మార్నింగ్ వాక్ వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Read More..

మూత్రంలో మంటగా ఉందా.. అయితే జాగ్రత్త?

Advertisement

Next Story

Most Viewed