- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోజుకో ఉసిరి కాయని తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
దిశ, ఫీచర్స్: పోషకాలతో నిండి విటమిన్ సి యొక్క గొప్ప సహజ మూలం ఉసిరి. దీనిని ఇండియన్ గూస్బెర్రీ అని కూడా పిలుస్తారు. ఉసిరిని రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు అని చెబుతున్నారు నిపుణులు. దీని వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఉసిరి చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి, రక్తాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగపడటంతో పాటు.. కంటి చూపును మెరుగుపరచడానికి కూడా ఎంతో ఉత్తమైనదని తెలుస్తుంది. ఆమ్లా జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అయితే.. ఇన్ని ఔషధ గుణాలు ఉన్న ఉసిరిని రోజుకొకటి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
* మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉసిరి దివ్యౌషధంగా పనిచేస్తుంది. కాబట్టి రోజుకో ఉసిరిని తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్‌లో ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.
* ఉసిరిలో ఉండే క్రోమియం గుండె కవాటాలు మూసుకోకుండా నివారిస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కాబట్టి.. హృదయ సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఉసిరిని ఆహారంలో భాగం చేసుకోవాలి.
* బరువు తగ్గాలనుకునే వారికి ఉసిరి బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండి.. త్వరగా కడుపు నిండిన భావన కలిగిస్తుంది. దీంతో మితంగా ఆహారం తింటారు.
* ప్రతీ రోజూ ఉసిరిని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు.
* ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లామెంటరీ, యాంటీ గ్లైసమిక్ గుణాలు రోగాల బారిన పడకుండా కాపాడుతాయి.
* నిత్యం జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారికి ఉసిరికాయ పొడిని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు.